Hindu Festivals : హిందూ సంప్రదాయం ప్రకారం పండగలకు పర్వదినాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వచ్చే పండగలు… ఆయా సీజన్లకు అనుగుణంగా జరుపుకునేలా నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తారు మన పెద్దలు. మన హిందూ మతంలో సంవత్సరంలో ఎన్నో రకాల పండుగలు వస్తూనే ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి సుఖసంపదల కోసం, తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సుకోసం, తమ భర్తల దీర్ఘాయువు కోసం పూజలు చేస్తారు. అందుకే మహిళకు పూజలు ప్రత్యేకం. పూజలు చేసే సమయంలో స్త్రీలు స్పెషల్ గా తయారవుతారు. అందంగా కనిపించడానికి స్త్రీలు అలంకరణ నగలను నగలు దుస్తులు వంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువ మంది ఎరుపు రంగు దుస్తులను ధరిస్తారు. మరికొందరు స్త్రీలు దుస్తులను ఎంచుకునే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. ఇలా చేయడం వల్ల పూజ ఫలం దక్కడానికి బదులుగా హాని కలుగుతుంది. పండగల సందర్భాలలో ఎటువంటి దుస్తులను ధరించకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
నీలిరంగు: మహిళలు నీలిరంగులు వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ రంగు పూజకు పవిత్రమైనదిగా పరిగణింపబడదు. కానీ నేవీ బ్లూ కలర్ లేదని నలుపుగా కనిపించే ముదురు రంగులో ఉంటుంది. కనుక అట్లతద్దె రోజున నావి బ్లూ కలర్ చీరలు లేదా దుస్తులు ధరించడం నిషేధింపబడినది.
నల్ల రంగు: హిందూమతంలో, పండగలు లేదా ఏదైనా మతపరమైన వేడుకలు సమయంలో నలుపు రంగు వస్తువులను ఉపయోగించడం నిషేధింపబడినది. ఈ కారణంగా శుభకార్యాల సమయంలో లేదా పెద్ద పండగల్లో నల్లచెరలేదా ఇలాంటి బట్టలు ధరించడం మానుకోవాలి. ప్రత్యేకమైన రోజు ఈ రంగు చీరలు ధరించడం అశుభం.
Hindu Festivals : మహిళలు పర్వదినాలు, పండగల సమయంలో ఈ రంగు వస్త్రాలు ధరించాలి..

బ్రౌన్ కలర్ : కొన్ని పండగల సమయంలో గోధుమ రంగు చీరలు కూడా ధరించకూడదు. గోధుమ రంగుల పై రాహుకేతు ప్రభావం ఉంటుందని నమ్ముతున్నారు. రాహు కేతువుల వల్ల దేవతలకు కూడా ఇబ్బంది ఎదురవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో… కర్వ చౌత్ బ్రౌన్ కలర్ దుస్తులకు దూరంగా ఉండాలి.
తెలుపు రంగు: కార్వా చౌత్ నాడు వివాహిత స్త్రీలు పొరపాటున కూడా తెలుపు రంగు దుస్తులు ధరించకూడదు. మీరు డిఫరెంట్ గా కనిపించడం కోసం ఇలాంటి తప్పు చేస్తుంటే..
మీరు పెద్ద తప్పు చేయబోతున్నారు. తెలుపు రంగు ప్రయోజనానికి బదులుగా హాని కలిగించవచ్చు.
ఏ రంగు దుస్తులు ధరించవచ్చు అంటే. పండగల రోజున మహిళలు ఎరుపు రంగు మాత్రమే కాకుండా ఆకుపచ్చ. పసుపు గులాబీ మెరూన్ కలర్ చీరలు ధరించవచ్చు.