Guppedantha Manasu 14 October 2022 Episode : చిన్నితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు.. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 581 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. రిషి వసుధారాలు కలిసి బొమ్మలకులు కోసం చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. రిషి అంతలో గిఫ్ట్ గా ఇచ్చిన బొమ్మల్ని తీసుకువచ్చి కొన్ని ఫోటోలు దిగుతూ ఉంటారు. దేవియాని, రిషి, వసుదారాలు ఇంకా రాకపోయేసరికి కంగారుపడుతూ ఉంటుంది. గౌతమ్ వెల్లి పిల్చుకోస్తా అంటుండగా.. జగతి తనకి సైగ చేసి వెళ్లొద్దు అని చెప్తూ ఉంటుంది. ఇక దేవయాని మహేంద్రని వెళ్లి వాళ్ళిద్దరిని తీసుకురా అని చెప్తూ అలంకరణ అంతా అయిపోయింది కదా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర వెళ్తూ ఉండగా.. అంతలో వాళ్ళిద్దరూ పైనుంచి దిగి వస్తూ ఉంటారు. వాళ్లని అలా చూసిన జగతి, మహేంద్ర ,గౌతమ్ ,ధరణి సంతోషపడుతూ ఉంటారు. దేవయాని మాత్రం లోపల మండిపడుతూ ఉంటుంది. ఇక ఆ బొమ్మలు చూసి గౌతం ఇలా ఇవ్వరా అని అడుగుతూ ఉంటాడు కానీ నేను ఇవ్వను అని రిషి అంటూ ఉంటాడు.
అప్పుడు దేవి అని ఈ బొమ్మలు ఎక్కడివి అని అనగానే వసుధార నేనే కొని తయారు చేశాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు గౌతం కొన్ని ఫోటోలు తీస్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని కలిపి ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇక దేవయానిని కూడా రిషి పిలుస్తూ ఉంటాడు. కానీ వద్దులే అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక చాల్లే ఫోటోలు కార్యక్రమం చూడండి అని చెప్తూ ఉంటుంది. ఇక ఆలా బొమ్మల కొలువు దగ్గర అందరూ దండం పెట్టుకుంటూ మొక్కుకుంటూ ఉంటారు. జగతి, మహేంద్ర రిషి వసుధారాల గురించి మొక్కుకుంటూ ఉంటారు రిషి వసుధార గురించి మొక్కుకుంటూ ఉంటాడు వసుధార మాత్రం జగతిని రిషి సార్ అమ్మ అని పిలవాలి అని మొక్కుకుంటూ ఉంటుంది. ధరణి మాత్రం పెద్ద అత్తయ్య ఏదైతే కోరుకుంటారు అది జరగకుండా చెయ్ దేవుడా అని మొక్కుకుంటూ ఉంటుంది. ఇలా అందరూ మొక్కుకోవడం అయిపోగానే రిషి పైకెళ్ళి వాళ్ళ నాయనమ్మ చీరను తీసుకొచ్చి జగతికి ఇచ్చి మీ చేతుల మీదుగా వసుధారా కి ఇవ్వండి ఈ ఇంటి కోడలుగా ఈ చీర కట్టుకొని వస్తుంది అని చెప్తూ ఉంటాడు.
Guppedantha Manasu 14 October 2022 Episode : సంతోషంలో తేలిపోతున్న జగతి…
అప్పుడు జగతి సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. వసుధార మాత్రం కంగారుపడుతూ భయపడుతూ ఉంటుంది. ఇక జగతి చీరతో పాటు తాంబూలాలు కూడా ఇస్తూ ఉంటుంది కానీ వసుధార తీసుకోదు. అప్పుడు దేవయాని వెళ్లి ఆ చీర కట్టుకొని వచ్చి కలశానికి దండం పెట్టుకో ఈ ఇంటి కోడలుగా నిన్ను ఆహ్వానిస్తున్నాం అని రిషి ముందు డ్రామాలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ చీరని తీసుకొని వెళ్తుంది. లోపలికి వెళ్లి ఆలోచిస్తూ ఉండగా జగతి వెళ్లి ఏంటమ్మా మొండిగా చేస్తున్నావు ఆ చీర కట్టుకొని రా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు వసుధార అలా ఎలా కట్టుకోమంటారు గురుదక్షిణ విషయం ఇంకా అవ్వలేదు కదా మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని అమ్మ అని పిలవాలి అదే నాకు సంతోషం అని చెప్తూ ఉంటుంది. కానీ వసుధార కొన్ని అనుకుంటాం అవన్నీ జరగవమ్మా అని వసుధారా కి నాకు చెప్తూ ఉంటుంది. ఇక మహేంద్ర కూడా అక్కడికి వచ్చి వసుదారని చూస్తూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.