Sai Dharam Tej – Swathi : స్టేజ్ పై సాయి ధరంతేజ్ కు ముద్దు పెట్టేసిన స్వాతి….చూసిన వాళ్లంతా షాక్…

Sai Dharam Tej – Swathi : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మంత్ ఆఫ్ మధు…యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన పోస్టర్స్ ,టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగా యంగ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తన చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఇక దీనిలో భాగంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు.

Advertisement

actress-swathi-gives-kiss-to-sai-dharam-tej

Advertisement

ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ప్రొడ్యూసర్ యాష్ నా క్లోజ్ ఫ్రెండ్…యాస్ కి ఈ మూవీ ఫస్ట్ థియేటర్ రిలీజ్ అందుకే కాస్త కంగారు పడుతున్నాడు ఎలాంటి కంగారు పెట్టుకోకండి అని చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ శ్రీకాంత్ తీసిన భానుమతి రామకృష్ణ సినిమాలో ఉన్న కాంప్లెక్స్ ,ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా ఉంటాయని కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. సినిమాలో హర్ష చాలా బాగా చేశాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది.అలాగే యాక్టర్ గా నవీన్ ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

actress-swathi-gives-kiss-to-sai-dharam-tej

వివిధ పాత్రలో అల్లుకుపోయిన నవీన్ ఈ సినిమా ట్రైలర్ లో తాగుబోతు పాత్రలో కనిపించినప్పుడు నేను షాక్ అయ్యా అంటూ తెలియజేశారు. ఇక చివరిగా స్వాతి గురించి మాట్లాడుతూ..మీ అందరికీ తను కలర్స్ స్వాతి , కానీ నాకు మాత్రం స్వాతి గాడు..ఎందుకంటే మా కాలేజీ రోజుల నుండి నాకు స్వాతి బెస్ట్ ఫ్రెండ్. మా స్నేహం కలర్స్ స్వాతి లాగా స్టార్ట్ అయి తర్వాత స్వాతి , ఆ తర్వాత స్వాతి గాడులా మారిందని సాయి ధరంతేజ్ చెప్పుకొచ్చారు.ఇక ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ ఆల్ ది బెస్ట్ స్వాతి అని చెప్పాడు. దాంతో వెంటనే స్వాతి సాయి దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టింది. దీంతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Advertisement