Satyadev : ప్రస్తుతం టాలీవుడ్ లో బహుభాషా చిత్రాల ట్రెండింగ్ కొనసాగుతుంది. ఒక సినిమా తీసి దాన్ని రెండు లేదా మూడు భాషల్లో విడుదల చేసేందుకు అన్ని సినిమా ఫిలిం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను ఎన్నుకొని మరి సినిమాల్లో నటించేలా చేస్తున్నారు. అదే కోవాలో చెందిన నేటి నేటితరం ప్రతిభావంతుడైనటువంటి సత్యదేవ్. గాడ్ ఫాదర్ సినిమాతో ఇండస్ట్రీలో అతనిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.టాలీవుడ్ టాలెంట్ హీరో సత్యదేవ్ కన్నడ స్టార్ డాలి ధనుంజయతో కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Satyadev : గాడ్ ఫాదర్ సినిమా తర్వాత ఒక్కసారిగా మారిపోయిన సత్యదేవ్ గ్రాఫ్…
ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై బాల సుందరం దినేష్ సుందరం ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్రిమినల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇద్దరు ప్రధాన పాత్రలకు సంబంధించిన 26వ ప్రాజెక్ట్.తమిళనాడు ప్రియా భవాని శంకర్ కి హీరోయిన్గా అవకాశం ఇచ్చామని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా ద్వారా ప్రియా భవాని శంకర్ తెలుగుకి పరిచయం అయిపోతుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ తిరు సహా అనేక తమిళ చిత్రాలలో నటించింది. కాగా తెలుగులో మొదటి చిత్రం ఈ సినిమానే కానుంది.
ఈ మూవీలో ప్రియా ఫ్యాషన్ డిజైనర్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. చరణ్ రాజ్ మ్యూజిక్ కంపోజర్ గా మిరాక్ డైలాగ్స్ ఈ సినిమాకు రాయడం జరిగింది. సత్యదేవ్ ధనుంజయాలను ఒకే ఫ్రేమ్లో చూడడం త్రిల్లింగ్ గా ఉంటుందని ఈ సినిమా మేకర్స్ తెలియజేయడం జరిగింది. గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ తో కలిసి నటించిన సత్యదేవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్ గా అతడు నటించి అందరి చూపు ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత సత్యదేవ్ రెండు లాంగ్వేజ్లో సినిమా చేయడం కరెక్టు నిర్ణయం అని అందరూ అంటున్నారు