Tollywood : అఖండ‌, ఆర్ఆర్ఆర్, బింబిసార‌..ఈ మూడు సినిమాల్లో కామ‌న్‌గా ఉన్న ఈ మేట‌ర్ గ‌మ‌నించారా?

Tollywood : టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మొత్తం మంచి సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో బింబిసార చిత్రం ఊపిరి పోసింది. థియేట‌ర్స్‌కి జ‌నాలు రావ‌ట్లేద‌ని ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో ఈ సినిమా క్యూ క‌ట్టేలా చేసింది. దీనిపై పలువురు ప్ర‌ముఖులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బింబిసార బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుండ‌గా, ఈ సినిమాలో ఉన్న ఓ పాయింట్ మిగ‌తా సినిమాల‌లోను కామ‌న్‌గా మార‌గా, అవి కూడా మంచి విజ‌యం సాధించాయి. ఆ సినిమాలు మ‌రేదో కాదు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ‌, రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ న‌టించిన ఆర్ఆర్ఆర్.

పాప సెంటిమెంట్..

కరోనా సెకండ్ వేవ్ తర్వాత అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ? రారా అన్న సందేహాలను పటా పంచలు చేస్తూ బాలయ్య అఖండ సినిమాతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అఖండ చిత్రానికి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లికారు. ఇక మార్చి 25న విడుద‌లైన పాన్ ఇండియా చిత్రం ఎన్ని రికార్డులు బ‌ద్దలు కొట్టిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ ఈ సినిమా అనేక రికార్డ్స్ న‌మోదు చేస్తుంది. మొత్తానికి ముగ్గురు నంద‌మూరి హీరోలు న‌టించిన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించాయి.

Tollywood : అఖండ‌, ఆర్ఆర్ఆర్, బింబిసార‌..ఈ మూడు సినిమాల్లో కామ‌న్‌గా ఉన్న ఈ మేట‌ర్ గ‌మ‌నించారా?

Akhanda, RRR, Bimbisara common point noticed in these three movies
Akhanda, RRR, Bimbisara common point noticed in these three movies

అయితే ఈ మూడు సినిమాల విషయంలోనూ ఒక కామన్ పాయింట్ ఉందన్న విషయం ఇప్పుడు చర్చ‌కి వస్తుంది. ఈ మూడు సినిమాల్లోనూ చిన్న పాప సెంటిమెంట్ ఉంది. ఇది ఈ సినిమాల విజయంలో కీలకపాత్ర పోషించింది. కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాలో ఓ చిన్న పిల్ల చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. ఆ పిల్లను కాపాడటం కోసం కళ్యాణ్ రామ్ కథలో కీలకంగా మారతాడు. అఖండ సినిమా కూడా ఓ పాప చుట్టూ కథ తిరుగుతుంది. త్రిబుల్ ఆర్ సినిమాలో అసలు ఎన్టీఆర్ పోరాటం అంతా ఓ గోండు పిల్ల కోసమే..! ఆ పిల్ల చుట్టూనే కథ తిరుగుతుంది. నంద‌మూరి హీరోల‌కు పాప సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింద‌న్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది.