Pooja Hegde : పూజా హెగ్డే బ్యాడ్ టైం.. నో చెప్పిన సినిమా సూప‌ర్ హిట్‌

Pooja Hegde : మొన్న‌టి వ‌ర‌కు గోల్డెన్ లెగ్‌గా మారిన పూజా హెగ్డే ఇప్పుడు ఐర‌న్ లెగ్ అయింది. ఇటీవ‌ల పూజా న‌టించిన ఆచార్య‌, రాధే శ్యామ్, బీస్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. పూజా మంచి హిట్ కోసం ఇప్పుడు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తుంది. అయితే మంచి అవ‌కాశాన్ని ఈ అమ్మ‌డు జార‌విడుచుకోవ‌డంతో ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో రామ్‌గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ నటించారు. అయితే నిజానికి ఈ సీత పాత్రకు ముందు ఎంపిక చేసింది తనను కాదట. ఈ పాత్రకు పూజా హేగ్డేను ముందు ఈ పాత్రకు ఎంపిక చేశారట చిత్రబృందం. అంతేకాదు ఈ అమ్మడు సీతారామం సినిమా కోసం నెల రోజుల పాటు డేట్స్ కూడా కేటాయించారట.

పూజా ప‌రిస్థితి దారుణం..

పాత్ర నచ్చినా.. తప్పని పరిస్థితుల్లో సీతా రామం సినిమాకు పూజా నో చెప్పిందని సమాచారం. దీంతో అలా ఈ ప్రాజెక్ట్ మృణాళ్ ఠాకూర్ వద్దకు వెళ్లింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకున్న ఈ బ్యూటీ.. తన నటనతో కట్టి పడేసింది. ఈ మూవీ హిట్‌తో మృణాళ్‌కు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు క్యూకట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే. ప్రిన్సెస్ గా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. రానున్న రోజుల‌లో మృణాల్‌కి మంచి ఆఫ‌ర్స్ త‌లుపు త‌ట్టేలా క‌నిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే వరుస సినిమాలు ఫ్లాప్స్ అవుతుండడంతో బాధలో ఉన్న పూజా పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అయ్యింది.

Pooja Hegde : నో చెప్పిన సినిమా సూప‌ర్ హిట్‌

Pooja Hegde is in a bad time, she said no to a super hit film
Pooja Hegde is in a bad time, she said no to a super hit film

పూజా హెగ్డే ఎన్నో ఆశలు పెట్టుకున్న హరీష్ శంకర్‌, పవన్ కళ్యాణ్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ ఇప్పట్లో మొదలు అయ్యేలా లేదు. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను పెండింగ్‌లో పెట్టిన పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతం అనే తమిళ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల సైలెంట్‌గా జరిగినట్లు ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్ర‌మ్- మ‌హేష్ మూవీలో పూజా క‌థానాయిక అయిన ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న పూజా వెకేష‌న్‌కి వెళ్లి అక్క‌డ స‌ర‌దాగా గ‌డుపుతుంది.