Samantha : సమంత పై అక్కినేని అభిమానుల ఆగ్రహం, ఇదే నాగచైతన్యకు నీకు ఉన్న తేడా….

Samantha: కాఫీ విత్ కరణ్ షోలో సమంత చేసిన కామెంట్స్ ఎప్పుడు అక్కినేని అభిమానులను ఒకింత రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. అంతేకాకుండా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు తాను ఇచ్చిన సమాధానం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సమంతాను నీకు నాగచైతన్యకు ఉన్న తేడా అదే అంటూ సమంత పై అక్కినేని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

వివరాల్లోకి వెళితే నాగచైతన్య థాంక్యూ మూవీ ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆన్ స్క్రీన్ లో మీతో రొమాంటిక్ పాత్రలో చేసిన మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరంటూ అడుగగా చాలా హుందాగా నాకు సాయి పల్లవి మరియు సామ్ అంటే నచ్చుతుంది అని చెప్తూ సమాధానం ఇచ్చాడు. అదేవిధంగా సమంత కరణ్ జోహార్ తో జరిగిన కాఫీ విత్ కరణ్ షోలో నాగచైతన్య ని ఉద్దేశించి మీ భర్త అనగా ఒకింత కోపంతో నా మాజీ భర్త అని సంబోధించాలని చెబుతూ సమాధానం ఇచ్చింది.

Samantha : సమంత పై అక్కినేని అభిమానుల ఆగ్రహం, ఇదే నాగచైతన్యకు నీకు ఉన్న తేడా….

akkeneni fans fire on samantha
akkeneni fans fire on samantha

అంతేకాకుండా తన భర్త పై ఉద్దేశం గురించి అడగగా తమ ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే పదునైన వస్తువులు అక్కడ ఉంచరాదని తన మనసులో మాటని తెలిపింది.ఈ రెండిటిని పోలుస్తూ విడిపోయిన హుందాగా ఎవరు ప్రవర్తిస్తున్నారు అని సమంత పై అక్కినేని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. నాగచైతన్యను తాను సామ్ అని సంబోధించిన విధానంతో నేటిజెన్లు తెగ పొగుడుతూ ఉన్నారు. నాగ చైతన్య మరియు అక్కినేని అభిమానులు ఇదే నీకు చైతుకి ఉన్న తేడా అంటూ సమంత టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో సమంతా కి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.