Allari Naresh, : అల్లరి నరేష్ “అల్లరి” చిత్రంలో మొదటగా రంగ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకులలో అల్లరి నరేష్ గా ముద్ర వేసుకున్నాడు. తను ప్రతి సినిమాలో తన నటనతో అభిమానులలో కితకితలు పుట్టించాడు. తన సినిమాలలో హాస్యమే కాదు అభినయం కూడా ఉన్న పాత్రను చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. తను అల్లరి, తొట్టి గ్యాంగ్, ధనలక్ష్మి ఐ లవ్ యు, జూనియర్, సీమశాస్త్రి, కితకితలు, ఇలా చాలా సినిమాలు చేసి మంచి సక్సెస్ ను సాధించాడు. తను చేసిన సినిమాలకు ఉత్తమ నటుడు గా అవార్డ్ లను అందుకున్నాడు.
అయితే ఇది ఇలా ఉండగా గత సంవత్సరంలో వచ్చిన నాంది సినిమా మంచి సక్సెస్ హీరోగా మళ్లీ ఫామ్ లోకి వచ్చారు మన హీరో. అల్లరి నరేష్ మహర్షి, గమ్యం, నాంది సినిమాలలో తన నటనతో కొన్ని కోణాలను ఆవిష్కరించుకున్నడు. తను ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించుకున్నాడు. అయితే ఈ రోజు మన హీరో పుట్టినరోజు దాని సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో కొన్ని ఆసక్తికరమైన సీన్లు పల్లెటూరి బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీన్లు డ్రామాతో టీజర్ ఉత్కంఠత కలిగించింది.
Allari Naresh : ఉత్కంఠ భరితంగా అల్లరి నరేష్ “ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం” టీజర్.

అయితే మొత్తానికి ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకునేలా ఉండబోతుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఫర్మెల్ లుక్ లో కనిపించాడు. తెలుగు పల్లెటూరి వాతావరణం లో యాక్షన్ బ్యాచ్ డ్రాప్ లో ఎ.అర్ మోహన్ తెరకెక్కించారు . ఇందులో అల్లరి నరేష్ ఎలక్షన్ అధికారి పాత్ర లో నటించారు. అడవిలో ఉండే మారుమూల గ్రామం లోని సమస్యల పై అల్లరి నరేష్ చేసే పోరాటం ఆ కథనం పై సినిమా ఉన్నట్లు టీజర్ కనిపిస్తుంది. టీజర్ చాలా ఆకర్షణీయంగా ఉత్తంటతో ప్రేక్షకులను అక్కట్టుకునెలా ఉంది. అల్లరి నరేష్ 59వ చిత్రంగా ఈ సినిమా తెరకక్కుతోంది.