Sai Pallavi : నేను విరాట పర్వం సినిమాలో వెన్నెల క్యారెక్టర్ చేయడం తన అదృష్టం గా భావిస్తున్నాను అంటూ సాయి పల్లవి ట్వీట్.

Sai Pallavi : మోస్ట్ టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్ సాయి పల్లవి. ఈ సాయి పల్లవి హుందా తనానికి మారుపేరు. తన నటనతో అందరిని మేస్మరైజ్ చేసేసింది. సాయి పల్లవి ఇండస్ట్రీలోని ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే అభిమానుల మనసులను దోచేసుకుంది. అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి విరాట పర్వం సినిమాలో తన పాత్ర ఇంకా క్రేజ్ ని పెంచేసింది. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం చేశారు. ఇందులో రానా, సాయి పల్లవి కలిసి నటించారు. రానా రవన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి వెన్నెల పాత్రను పోషించింది. ఈ చిత్రంలో నక్సలైట్ గా రానా పాత్ర ఉంటుంది.

90లో సాగే స్టోరీ ఇది. రవన్న కొన్ని పుస్తకాలను రాస్తూ ఉంటాడు అయితే ఆ పుస్తకాలను వెన్నెల ఫాలో అవుతుంది. ఇలా తనని చూడకుండానే వెన్నెల రవన్న ప్రేమలో పడుతుంది. తర్వాత అడవికి వెళ్లి చాటుగా చూస్తూ ఉంటుంది. రవన్నా తో వెన్నెల అలా తన ప్రేమలో పడుతుంది. అయితే వెన్నెల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు తీసుకొస్తారు. వివాహం చేసుకో అని చెప్తుంటారు. వెన్నెల నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను రవన్నను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. నేను అడవికి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఒకరికి ఒకరు పరిచయం అవుతారు తర్వాత ప్రేమలో పడతారు సాయి పల్లవి కూడా నక్సలైట్ గా మారుతుంది.

Sai Pallavi : వెన్నెల క్యారెక్టర్ చేయడం తన అదృష్టం గా భావిస్తున్నాను

Sai Pallavi Tweet about vennela role
Sai Pallavi Tweet about vennela role

తర్వాత ఒక ఎమోషనల్ సీన్ తర్వాత నాగమల్లి దారిలో అనే సాంగ్ వస్తుంది. తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. ఇలా కథ క్లైమాక్స్ కు వస్తుంది. ఈ వెన్నెల పాత్ర చేయడం ఎంతో అదృష్టం అని చెప్తుంది సాయి పల్లవి ఈ సినిమా షూట్ సమయంలో దిగిన ఫోటోలను తన పోస్ట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో వెన్నెల క్యారెక్టర్ ను నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ చిత్రం ప్రతి సన్నివేశం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నేను ఈ క్యారెక్టర్ కు అంతలా కనెక్ట్ అయ్యాను అని చెప్పింది. ఈ చిత్రం ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ లో కూడా వస్తుంది ఈ చిత్రాన్ని మీరు అందరూ ఆదరిస్తే నేను చాలా సంతోషిస్తా అని ట్విట్ చేసింది సాయి పల్లవి.