Pushpa : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పూనకాలు.. అక్కడ కూడా పుష్ప రిలీజ్

Pushpa : పుష్ప.. నీ అవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అలరించిన విషయం తెలిసిందే కదా. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. యావత్ దేశమంతా పుష్ప సినిమాకు బ్రహ్మరథం పట్టింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఒక చరిత్రను సృష్టించింది. ఈ సినిమా గత సంవత్సరం రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయి సరిగ్గా సంవత్సరం కావస్తోంది. ఇప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన మెమోరీస్ ఇంకా సినీ ప్రియుల మనసుల్లో దాగి ఉన్నాయి. డైలాగ్స్ కావచ్చు.. సినిమాలోని పాటలు కావచ్చు.. ఇప్పటికీ ప్రతి ఇంట్లో మారుమోగుతూనే ఉన్నాయి.

Advertisement
allu arjun pushpa to be released in russia
allu arjun pushpa to be released in russia

ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అవడం, వందల కోట్లు వసూలు చేయడంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే.. ఈ సినిమాను ఇప్పుడు వేరే దేశాల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెల అంటే డిసెంబర్ 8న రష్యాలో విడుదల చేస్తున్నారు. రష్యన్ భాషల్లో ఈ సినిమాను డబ్ చేసి అక్కడ విడుదల చేస్తున్నారు.

Advertisement

Pushpa : సినిమా ప్రమోషన్స్ కోసం రష్యా వెళ్లనున్న సినిమా యూనిట్

రష్యాలో సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ కోసం మూవీ యూనిట్ రష్యా వెళ్తోంది. డిసెంబర్ 1న మాస్కో లో సినిమా ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ పాల్గొంటుంది. డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. ప్రమోషన్స్ పూర్తయ్యాక.. మూవీ యూనిట్ తిరిగి ఇండియాకు చేరుకుంటుంది. అయితే.. ఇప్పటికే రష్యాలో మూవీ రిలీజ్ కాబోతోందని తెలుసుకున్న రష్యన్లు ఆ మూవీ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఇక..పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. గత నెలలోనే రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రారంభం అయింది. యాక్షన్ సీక్వెన్స్ లను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Advertisement