Vijay Deverakonda : ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్ సినిమా షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలాన్నిచ్చేలా.. సేమ్ టు సేమ్ సలార్ లో ప్రభాస్ లుక్ ను పోలిన విజయ్ దేవరకొండ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్, విజయ్ ఇద్దరి ఫోటోలను పక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు.

నిజానికి విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ మూవీలో నటిస్తున్నాడు. దానికి ఖుషీ అని పేరు పెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. అయితే.. సామ్ కు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేకపోవడంతో సినిమా షూటింగ్ లేట్ అవుతోంది. సమంత.. ఆరోగ్యం కుదుటపడ్డాక షూటింగ్ లో జాయిన్ అవుతుంది.
Vijay Deverakonda : సలార్ లో కీలక రోల్ లో విజయ్
అయితే.. సలార్ లో విజయ్ దేవరకొండ కీలక రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా క్లయిమాక్స్ లో విజయ్ ను పరిచయం చేస్తారట. సలార్ 2 లో విజయ్ ను మెయిల్ లీడ్ గా తీసుకొని సలార్ కు సీక్వెల్ తీసుకురావాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియకున్నా నెటిజన్లు మాత్రం ఎవరిని నచ్చిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. సినిమా యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయితే.. విజయ్ ఫోటోను చూసి కొందరు మాత్రం అది విజయ్ సరికొత్త థమ్స్ అప్ యాడ్ కు సంబంధించిన ఫోటో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ నిజంగానే సలార్ లో నటిస్తున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.