Allu Sirish : అల్లు శిరీష్ టాలీవుడ్ లోకి ‘ కొత్తజంట ‘ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్న సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడడం లేదు. అల్లు శిరీష్ గత సినిమా ఊర్వశివో రాక్షసివో సినిమా మంచి హిట్ కొట్టిన మళ్లీ ఇంకో ప్రాజెక్టును మాత్రం పట్టాలెక్కించలేకపోతున్నాడు. అల్లు కాంపౌండ్ నుంచి వచ్చిన కూడా అల్లు శిరీష్ సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయ్యారు. కానీ శిరీష్ క్రేజ్ మాత్రం ఆ కాంపౌండ్ కూడా దాటినట్టుగా కనిపించడం లేదు.
సరైన హిట్టు కోసం శిరీష్ ప్రయత్నిస్తున్నారు కానీ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం లేదు . ప్రస్తుతం అల్లు శిరీష్ సినిమాలకు దూరంగానే ఉన్నట్లుగా ఉన్నారు. ఇకపోతే అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన నెట్టింట్లో వేసే పంచులు, ఇచ్చే కౌంటర్లు హైలెట్ అవుతుంటాయి. శిరీష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అందరూ ఫిదా అయిపోతుంటారు. కరోనా టైంలో ఓ వ్యక్తి లాప్టాప్ అడగడం, అమెజాన్ ఫ్లిప్కార్ట్ పాస్వర్డ్ లు అడగడం, వాటికి ఆయన రిప్లై ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఆ మధ్య వరుణ్, లావణ్య పెళ్లిలో శిరీష్ సందడి చేశారు. అలాగే శిరీష్ అయాన్ ల మీద నవ్వించేలా మీమ్స్, ట్రోల్స్ వస్తుంటాయి. ఇటీవల మంచు లక్ష్మితో అల్లు శిరీష్ దిగిన ఫోటో బాగా ట్రెండ్ అయింది. అయితే తాజాగా శిరీష్ సోషల్ మీడియాలో ఓ ఫన్నీ రీల్ షేర్ చేశాడు. అందులో తన ఏజ్ వాళ్లంతా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటే, తాను మాత్రం జిమ్ లో ఇలా ఐదు కేజీల డంబెల్ ఎత్తుకొని వర్క్ అవుట్ లు చేస్తున్నాను అని రీల్ లో ఉంది. ఇప్పుడు తన జీవితం అలానే ఉంది అని అల్లు శిరీష్ పోస్ట్ ద్వారా తెలియజేశారు.