Balakrishna : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య క్రేజ్ విపరీతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య బాబుతో సినిమా చేయాలని చాలామంది దర్శకులు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ్ దర్శకులు కూడా బాలయ్య బాబు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ తమిళ దర్శకుడు బాలయ్యకు కథ వినిపించినట్లుగా సమాచారం. అయితే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ లింగుస్వామి అనే డైరెక్టర్ బాలయ్య బాబుతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారట.
అయితే ఈయన ఇంతకుముందు తెలుగులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా “వారియర్” అనే సినిమాను చేయడం జరిగింది. ఇక ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసేందుకు కథ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాక బాలయ్య బాబుకు తగినట్టు మంచి కథను రెడీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ కథను బాలయ్యకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసేందుకు డైరెక్టర్ ఎదురుచూస్తున్నట్లుగా సమాచారం. అయితే బాలయ్య బాబు ప్రస్తుతం బాబి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. కావున ఈ సినిమా పూర్తయిన తర్వాతే నెక్స్ట్ సినిమా మీద బాలయ్య ఫోకస్ చేస్తారు.
అయితే లింగు స్వామి రాసిన స్టోరీ నచ్చినప్పటికీ సినిమా ఎప్పుడు మొదలు పెడతారు అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ క్రమంలో లింగుస్వామి బాలయ్య కోసం ఎదురుచూస్తాడా లేక మరో హీరోతో సినిమా చేస్తాడా అనేది చూడాలి. ఇక బాలయ్య బాబు విషయానికొస్తే ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉంటున్నారు. అంతేకాక అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ మూడు రకాల టాస్కులను చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో బాలయ్య మరో సినిమా చేయాలంటే ఏపీ ఎలక్షన్స్ అయిపోవాల్సిందే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.