Anasuya : యాంకర్ అనసూయ జబర్దస్త్ షో ద్వారా ఎంత పాపులర్ అయిందనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె ఎంత స్టార్డమ్ ని అనుభవిస్తుందో చెప్పనవసరం లేదు. కేవలం జబర్దస్త్ షో ద్వారానే ఇంత పాపులర్ అయిందని అనుకోవచ్చు. ఇటువంటి షోకి అనసూయ గుడ్ బాయ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ షో కి గుడ్ బాయ్ చెప్పి వచ్చినప్పుడు… ఇతర షూటింగ్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని అనసూయ చెప్పింది. కానీ ఆ సమాధానంలో పూర్తిగా క్లారిటీ లేకపోవడం వల్ల… అనసూయ ఏదో దాస్తుందని అసలు కారణం అది కాదని ప్రచారం మొదలైంది.
జబర్దస్త్ షో నుండి నాగబాబు, రోజాల తో పాటు ఇతర కంటేస్టంట్ ఒకరి నుండి మరొకరు తప్పించుకోవడం వల్లనే…. అనసూయ కూడా బయటకు వచ్చిందని తెలుస్తుంది. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదంటూ తేల్చి చెప్పిన అనసూయ, అసలు కారణం ఏంటంటే రీవిల్ చేసింది. ఈ షోలో తమపై వేసిన పంచులు తనకు నచ్చడం లేదని చెప్పింది. ఆ పంచులు నచ్చక ఎన్నోసార్లు ముఖం తిప్పేసుకున్నానని.. కానీ అవేవీ ఈ షోలో కనిపించవని వెల్లడించింది. కానీ క్రియేటివిటీ ఫీల్డ్ లో ఇటువంటి తప్పవని తెలిపింది.
Anasuya : ఆ ఊబిలో చిక్కుకుంటాననే భయంతోనే….

అదే ఊబిలో నేను చిక్కుకుపోవడం ఆమెకి ఇష్టం లేనట్లుగా వివరించింది. ఆ షో నుంచి రెండేళ్లుగా తప్పుకోవాలని అనుకుంటున్నాట్లుగా…. ఇప్పటికీ అది వీలు పడిందని తేల్చి చెప్పింది. అంతే తప్ప… నాగబాబు, రోజా బయటికి వెళ్ళిపోయారని కారణం మాత్రం కాదని స్వష్టత ఇచ్చింది. అనసూయ కి జబర్దస్త్ షో అంటే చాలా ఇష్టమని తెలిపింది. తాను నటనపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని, సినిమాలలో నటన కారణంగా నే జబర్దస్త్ షో కి వీలుపడడం లేదని చెప్పుకోవచింది.