Anasuya Bharadwaj : బుల్లితెర మాజీ యాంకర్ అనసూయ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలతో కూడా బిజీగా ఉంటారు. అమలాపురం నుంచి అన్నమయ్య జిల్లా వరకు ఎక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ అయిన అనసూయ అక్కడ వాలిపోతూ ఉంటారు. తాజాగా ఆమె అన్నమయ్య జిల్లా రాజచోటిలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి చేశారు. ఆమెను చూడటం కోసం జనం భారీగా తరలివచ్చారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అనసూయ ఎక్కడున్నా చుట్టూ ఉన్న జనంతో పాటు కెమెరా కళ్ళు తన పైన పడేటట్లుగా చేస్తారు.
ఇక ఆమె ధరించే మోడల్ డ్రెస్సులు, బికినీలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చీర కట్టిన కూడా ఆమె కళ్ళు తిప్పుకోకుండా చేయడం ఆమె ప్రత్యేకత. తాజాగా షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో అనసూయ తెగ సందడి చేశారు. చీరకట్టుతో అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ పై అందరి దృష్టి వెళ్లేటట్లు చేశారు. లోపల ధరించే బ్రా మాదిరిగా ఉన్న బ్లౌజ్ తో వెరైటీ రవికను ధరించారు. దీంతో అనసూయను చూడటానికి జనం ఎగబడ్డారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అనసూయ పుష్ప 2 సినిమా గురించి చెప్పుకొచ్చారు.
పుష్ప 2 సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడుతున్నామని, అల్లు అర్జున్ గారు తగ్గేదేలే అన్నట్లుగా హార్డ్ వర్క్ చేస్తున్నారని, సుకుమార్ సార్ హై రేంజ్ లో సినిమా తీస్తున్నారు అని ఆమె అన్నారు. అలాగే చిత్తూరు స్లాంగ్ మాట్లాడటం చాలా కష్టం కానీ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు అయితే టకటకా మాట్లాడేస్తారు. షెడ్యూల్ షెడ్యూల్ కి ఇంప్రూవ్ అయిపోతున్నారు అంటూ అనసూయ పుష్ప సినిమా గురించి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.