Mangalavaram : ” మంగళవారం ” ప్రీమియర్ షో రివ్యూ…

Mangalavaram  : RX100 వంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి మరియు హీరోయిన్ రాజ్ పుత్ పాయల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా “మంగళవారం”. ఇక ఈ సినిమాను ముద్ర మీడియా వర్క్ బ్యానర్ పై స్వాతి రెడ్డి గనుపాటి మరియు ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ఏ క్రియేటివ్ వర్క్స్ సంస్థ దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైలర్ విడుదల కాగా అది కాస్త సినిమాపై భారి అంచనాలను పెంచేసింది. ఇక ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో నవంబర్ 16 నుండి ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోలు వేయాలని సినీ బృందం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Movies | Page 1380 | Telugu360.com

Advertisement

ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలలో కొన్ని మల్టీప్లెక్స్ లలో నవంబర్ 16 నైట్ నుండి సినిమా ప్రేమియర్ షో లు ప్రదర్శించడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా సినీ ఇండస్ట్రీలో పెద్దలకు ఈ సినిమా ఆల్రెడీ చూపించడం జరిగింది. వారికోసం స్పెషల్ షో వేసి మరి చూపించడం జరిగింది. అయితే ఈ స్పెషల్ షో చూసిన వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. వారు అందిస్తున్న సమాచారం ప్రకారం సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత నుండి హీరోయిన్ పాయల్ పాత్ర ఎంటర్ అవుతుందట. అలాగే సినిమాలో క్రియేట్ చేసిన సస్పెన్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

ఆ తర్వాత కొంత డ్రామా నడిచినప్పటికీ ఇంటర్వెల్ బ్లాక్ లో షాకింగ్ ఎపిసోడ్ ఎండ్ అయి సెకండ్ ఆఫ్ లో క్లారిటీ వస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఒ రేంజ్ లో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఇప్పటివరకు ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ ను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అవడంతో నెగిటివ్ కామెంట్స్ వచ్చే విధంగా లేదని చెబుతున్నారు. ఇక ఈ సినిమా యొక్క బ్యాగ్రౌండ్ స్కోర్ థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు వచ్చిన తర్వాత కూడా వారిని వెంటాడుతుందని తెలుపుతున్నారు. మొత్తంగా సినీ ప్రముఖుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

Advertisement