Anasuya : అనసూయ బుల్లితెరపై తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తన గ్లామర్ తో సోషల్ మీడియాను బాగా వేడెక్కిస్తుంది. సినిమాల్లోను తన సత్తా ఏంటో చాటుకుంటూ దూసుకెళుతుంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రతి సినిమాలో తన పాత్రకి తగ్గ న్యాయం చేస్తూ వస్తుంది. అందుకే ఈ అమ్మడుకి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అయితే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది ఈ బ్యూటీ.
రామ్ చరణ్ కు రంగమ్మత్త గా తన పాత్రను ఎందరికో గుర్తుండేలా చేసింది. ఆ తరువాత కూడా ఆసక్తికరమైన పాత్రలను చేస్తూ బుల్లితెరపై కూడా తన హవా కొనసాగిస్తూ ఉంది. అయితే తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘ రంగమార్తాండ ‘ సినిమాలో అనసూయ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాలో అనసూయ పాత్ర కీలకంగా ఉంటుందని చిత్ర బృందం అంటున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Anasuya : అనసూయ, కృష్ణ వంశీ కోసం ఏం చేసిందంటే…?
అయితే తాజాగా అనసూయ ‘ రంగమార్తాండ ‘ సినిమాలోని తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ చెబుతుంది. ఇలా డబ్బింగ్ చెబుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో రివిల్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో తన పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, కృష్ణవంశీ డైరెక్షన్లో సినిమా చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు అనసూయ తెలిపింది. ఇక ఈ సినిమాను అతి త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
Actress @anusuyakhasba starts dubbing ????️ for #Rangamarthanda@director_kv @kalipu_madhu pic.twitter.com/9dUNtmxpHB
— Vamsi Kaka (@vamsikaka) July 11, 2022