Viral Video : మనుషులకు, జంతువులకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. కొన్ని జంతువులు అయితే మనిషి లేకుంటే బతకలేవు. మనుషులు ఎక్కడుంటే అవి అక్కడే ఉంటాయి. అటువంటి వాటిలో కుక్కలు ఒకటి. ఆ తర్వాత పిల్లులు కూడా మనుషులతోనే జీవిస్తాయి. బర్రెలు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు, కోళ్లు, మేకలు.. ఇలా ఈ జంతువులన్నీ మనుషులతో మమేకం అయి జీవించేవే.

కుక్క, పిల్లి లాంటి వాటిని పెట్స్ గా పెంచుకుంటాం. ఏదో సరదా కోసం.. కాపాలా కోసం పెంచుకుంటాం. కానీ.. మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి వాటిని మాంసం కోసం లేదంటే ఉపాధి కోసం పెంచుకుంటాం. చిన్నప్పటి నుంచి మనతో పెరిగిన జంతువులు అయితే మనతో బంధాన్ని ఏర్పరుచుకుంటాయి.
Viral Video : కసాయి దగ్గరికి పోయినా కొన్ని జంతువులు యజమానులను వదలవు
ఎన్ని రోజులు పెంచినా.. చివరకు కోళ్లు అయినా గొర్రెలు, మేకలు అయినా మాంసం కోసం అమ్మేయాల్సిందే. అలాగే ఓ వ్యక్తి తన వద్ద ఉన్న మేకను బక్రీద్ సందర్భంగా అమ్మేందుకు మార్కెట్ కు తీసుకొచ్చాడు. వేరే వాళ్లకు మేకను అమ్మేశాడు. మేకను అమ్మిన వ్యక్తి దగ్గర్నుంచి డబ్బులు తీసుకుంటుండగా మేకకు తనను అమ్మేశాడని అర్థం అయిందో ఏమో… తన యజమానిని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అచ్చం మనిషి ఏడ్చినట్టుగా మేక ఏడవడంతో అక్కడున్న వాళ్లు కూడా కంటతడి పెట్టారు. మేక యజమాని కూడా దాన్ని కౌగిలించుకొని బావురుమన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అది యజమానికి, దానికి మధ్య ఉన్న అనుబంధం.. అది నిజమైన ప్రేమ అంటే అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.
https://www.facebook.com/vishwanath.saini.31/videos/5369351319754124