Anasuya Bharadwaj : జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన యాంకర్ అనసూయ ఊహించని విధంగా వెండితెరపై అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఆమె నటించిన సినిమాలన్ని మంచి విజయాలను అందుకున్నాయి.అంతేకాక నేటి యువతలో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెను స్టార్ సెలబ్రిటీని చేసింది. దీంతో వెండితెర పై భారీ ఎత్తున పారితోషకం తీసుకుంటూ తీసుకుంటూ వస్తుంది. అయితే ఈ అమ్మడు ఫాలోయింగ్ చూసి మూవీ మేకర్స్ కూడా ఆమె తో లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తమిళ్ లో నయనతార హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు రచయిత స్క్రిప్ట్ ను మార్చి ఆ సినిమాను అనసూయతో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే నాయన తార ప్లేస్ లో అనసూయ ఎంతవరకు సెట్ అవుతుంది అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అనసూయ అభిమానులైతే నయనతార పాత్రకు అనసూయ కచ్చితంగా సరిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన అనసూయ ఇప్పుడు ఏకంగా లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేంత రేంజ్ కు ఎదిగింది అంటే గ్రేట్ అని చెప్పాలి.