Hero Nani : దసరా వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత హీరో నాని నటిస్తున్న సినిమా హాయ్ నాన్న.ఇక ఈ సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినీ బృందం మరియు హీరో నాని ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొనగా హీరో నాని కొత్త తరహా ప్రమోషన్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు.
అయితే హీరో నాని తాజాగా ప్రమోషన్స్ ను చాలా విభిన్నంగా చేయడం మొదలుపెట్టాడు. రాజకీయ నాయకుడిలాగా , ఒక పార్టీ అధ్యక్షుడిలాగా ప్రమోషన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ను ఇమిటేట్ చేస్తూ ఇటీవల ఆయన విడుదల చేసిన ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో హీరో నాని మాట్లాడే ప్రతి మాట నవ్వు తెప్పిస్తుంది. ప్రతి డైలాగ్ కేసీఆర్ ని ఇమిటెట్ చేస్తూ చేయడంతో వీడియో హైలెట్ గా మారింది. ఇక ఈ వీడియోలో హీరో నాని సినిమా ఫలితం గురించి మాట్లాడుతూ…
ఊరికే
Press meet పెట్టా ????#HiNanna #HiNannaOnDec7th pic.twitter.com/bZIQroHN5P
— Nani (@NameisNani) November 20, 2023
సినిమా బాగుంటే ఆడతది లేకుంటే పీకుతది..డిసెంబర్ 7న థియేటర్లో దావత్ చేసుకోవాలి ..హలో తమ్ముడు నువ్వేదో కిరికిరి చేయాలని చూస్తున్నావ్ అదేం కుదరదు అనుకున్న టైంకి సినిమా విడుదలవుతుంది అంటూ తెలంగాణ యాస లో అచ్చం సీఎం కేసీఆర్ లాగా మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నాని సినిమా ప్రమోషన్స్ వింతగా ఉండటంతో సినిమా హైప్ కూడా విపరీతంగా పెరిగింది.