Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి తెలుసు కదా. జబర్దస్త్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ సుందరి. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తనకు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తెలుగు స్టార్ హీరోయిన్లకు దీటుగా అవకాశాలను పొందుతూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది అను.
ఇటీవల తను పుష్ప సినిమాలోనూ నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తాజాగా తను దర్జా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా జులై 22 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
Anchor Anasuya : కనకం పాత్రతో భయపెట్టబోతున్నాను అన్న అనసూయ
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నేను ఈ సినిమాలో కనకం అనే పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నేను భయపెడతాను. ఇది వండర్ ఫుల్ సినిమా. మూవీ ప్రమోషన్స్ లో కొన్ని కారణాల వల్ల పాల్గొనలేకపోయాను. దానికి సారీ. కానీ.. నా లైఫ్ లో తొలిసారి యాక్షన్ సీన్స్ లో నటించా.. అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.
అయితే.. ఈ సినిమాలో ఫేమస్ అయిన ఓ డైలాగ్ ను అనసూయ చెప్పింది. నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఇంట్లో కూర్చొన్న ఆడదాన్ని అనుకున్నావ్ రా… చీల్చి చెండాడేస్తా నా కొడకా.. అంటూ ఊర మాస్ డైలాగ్ చెప్పి తన ఫ్యాన్స్ కు కిక్కు ఎక్కించింది అనసూయ. వామ్మో.. దర్జా సినిమాలో అనసూయ పాత్ర ఇలా ఉండబోతోందా? ఇంకా సినిమాలో ఇలాంటి మాస్ డైలాగ్స్ ఎన్ని ఉన్నాయో? మొత్తానికి అనసూయ ఈ సినిమాతో పెద్ద సాహసమే చేసింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.