Anushka : చలన చరిత్ర పరిశ్రమలు అనుష్క అంటే స్టార్ హీరోయినని క్రేజ్ ఇప్పటికీ ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించిన అనుష్క తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. నాగచైతన్యకు యోగా టీచర్ గా అపాయింట్ అయిన అనుష్క ఒక్కసారిగా పూరి జగన్నాథ్ సూపర్ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ వయసులో కూడా అనుష్క తనకంటే చిన్నవాడైనటువంటి నవీన్ పోలిశెట్టితో సినిమాలో నటిస్తోంది. తనకంటే చిన్నవాడైనటువంటి నవీన్ పోలిశెట్టి పక్కన హీరోయిన్గా అనుష్క చేయడంతో ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇప్పటికే 40 ఏళ్ళు దాటిన అనుష్క సోషల్ మీడియాలో ఎన్నోసార్లు తన పెళ్లి వార్త వైరల్ అవుతూ వచ్చింది. అనుష్కకు ప్రభాస్ కి పెళ్లి అని ఎన్నోసార్లు వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. మూడు సంవత్సరాల క్రితం నిశ్శబ్దం అనే సినిమాలో కనబడిన అనుష్క ఇప్పటివరకు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. అనుష్క ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అంతేకాకుండా అనుష్క ప్రభాస్ల జోడి తెరపైనే కాకుండా బయట కూడా హిట్ పేయిర్ గా మారిపోయింది.
Anushka : ఇక లాభం లేదని అనుష్క ఇలా చేసిందా….

వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గత కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తామిద్దరం మంచి స్నేహితులమని ఈ వార్తలు ను ఎన్నిసార్లు ఖండించిన ప్రేమ టాపిక్ పై గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. అనుష్క అంటే ప్రభాస్ ఫ్యామిలీలో కూడా అందరికీ చాలా ఇష్టం. అంతేకాకుండా కృష్ణంరాజు చికిత్స పొందుతున్నప్పుడు కూడా అనుష్క ఆయనను చూసేందుకు హాస్పిటల్ కి వెళ్ళింది. ప్రభాస్ పెదనాన్న మరణించిన తర్వాత వారి ఇంటికి వెళ్లి ప్రభాస్ ను పరమశించింది. కాబట్టి ఎవరికీ తెలియని ఏదో బాండింగ్ వీళ్లిద్దరి మధ్య అయితే నడుస్తుంది.
ప్రభాస్ పై అనుష్క ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ 40 ఏళ్ళు వయసు దాటడంతో విసిగ్గు చెందిన అనుష్క ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనుష్క వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది. హైదరాబాద్కు చెందిన ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గుసగుసలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది గట్టి షాకే అని చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ పై హిట్ పేరుగా నిలిచిన వీళ్ళిద్దరూ జీవితం లోను మంచి భార్యాభర్తలు అవ్వాలని అందరూ ఆశించారు. అనుష్క ఈ సంచలన నిర్ణయం నిజమే అయితే అందరికీ ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అవుతుంది.