Viral Video : ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల చాయ్ లు దొరుకుతాయి. అల్లం చాయ్ దగ్గర్నుంచి బ్లాక్ చాయ్, బెల్లం చాయ్, బాదాం చాయ్.. ఇలా పలు రకాల చాయ్ లను మనం చూస్తున్నాం. కాఫీలు కూడా పలురకాలు దొరుకుతాయి. ఈ మధ్య కేవలం చాయ్ ఔట్ లెట్స్ బాగా క్లిక్ అవుతున్నాయి. మార్కెట్ లో సుమారు 100 రకాల చాయ్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ.. మీరు ఎప్పుడూ ఇలాంటి చాయ్ ని అయితే తాగి ఉండరు.
అవును.. ఈ జన్మలో మీరు ఈ చాయ్ ని తాగి ఉండరు. ఒకవేళ తాగినా మళ్లీ ఇంకోసారి తాగరు. సాధారణంగా చాయ్ అంటే ఎలా చేస్తారో తెలుసు. చాయ్ పత్తా, చెక్కర, పాలు, నీళ్లు కలిపి చాయ్ ని తయారు చేస్తారు. కానీ.. ఈ చాయ్ ని ఎలా చేస్తారో తెలిస్తే ఇంకోసారి చాయ్ జోలికే వెళ్లరు మీరు.
Viral Video : డ్రాగన్ ఫ్రూట్ తో చాయ్
ఓ హోటల్ లో డ్రాగన్ ఫ్రూట్ చాయ్ ని అమ్ముతున్నారు. దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? డ్రాగన్ ఫ్రూట్ లోని లోపల గుజ్జును తీసి దానితో చాయ్ చేస్తున్నారు. ఇలాంటి చాయ్ కోసం చాలామంది అక్కడ క్యూ కడుతున్నారట. అయితే.. ఈ చాయ్ దొరికేది మన దగ్గర కాదులేండి. ఈ చాయ్ బంగ్లాదేశ్ లో దొరుకుతుందట. అయితే.. ఈ డ్రాగన్ ఫ్రూట్ చాయ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒరేయ్.. ఇలా ఉన్నారేంట్రా మీరు. అందులో కాస్త విషం కలపండిరా అంటూ నెటిజన్లు షాకిస్తున్నారు. కామెంట్లతో ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ డ్రాగన్ ఫ్రూట్ చాయ్ వీడియోను చూసేయండి.
View this post on Instagram