Jabardasth : బుల్లితెరలో జబర్దస్త్ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ షో ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. దీనిపై ఇప్పటి వరకు చాలామంది పాజిటివ్ గానే కామెంట్ చేశారు. కానీ ఈమధ్య చాలామంది ఈ షోలో ప్రాసెసింగ్ సరిగా లేదని, స్కిట్స్ చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వరని, ఫుడ్ సరిగా పెట్టరని చాలా కంప్లైంట్స్ ఇచ్చారు. అయితే తాజాగా మరో విషయం బయటపడింది. జబర్దస్త్ లో ఇన్నాళ్లు మగాళ్ళే లేడీ గెటప్స్ వేసి నవ్వించారు. అయితే ప్రస్తుతం కొందరు ఆడవాళ్ళు కూడా మేము కూడా కామెడీ చేయగలమని జనాలని మెప్పించగలమని జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇచ్చారు.
Jabardasth : అందుకే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారా…
అలాగే వాళ్ళ నటనతో మెప్పిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్లోకి లేడీ వెళ్లాలంటే ఆ టీం లీడర్స్ తో క్లోజ్ గా ఉండాలట, వాళ్లతో ఖచ్చితంగా గడపాలని వాళ్ళ కోరికలు తీర్చాలని అప్పుడే జబర్దస్త్ లోకి వాళ్లని కమెడియన్స్గా కంటెస్టెంట్ గా తీసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ బాధ తట్టుకోలేక రీసెంట్ గా జబర్దస్త్ నుంచి ఓ స్టార్ కంటెస్టెంట్ బయటికి వచ్చేసినట్లు చెప్పుకుంటున్నారు.

అంతేకాదు ఆమె జబర్దస్త్ లోకి వెళ్లే ముందు ఇలాంటి ప్రాసెస్ లేదని కానీ ఆ తర్వాత ఇలాంటివి ఎక్కువ అయిపోయాయని, దీంతో తను భయపడి మానేసిందని టాక్. అయితే ఆమె స్కిట్లో లేకపోవడం టీం లీడర్స్ కి చాలా మైనస్ గా మారింది. ఒకప్పుడు కంటిన్యూగా స్కిట్లు కొట్టేవాళ్ళు ఇప్పుడు అభిమానుల్ని మెప్పించలేకపోతున్నారు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు సినిమా ఇండస్ట్రీలో ఇలా జరుగుతాయి అనుకున్నాం, కానీ బుల్లితెరలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా. ఎక్కడ ఆడవాళ్లకు సేఫ్టీ లేకుండా పోయిందంటూ కొందరు బాధపడుతున్నారు.