Bigg Boss Season 7 : ఇక మొదలెడదామా….బిగ్ బాస్ సీజన్ 7…ఈరోజు నుండి ప్రారంభం…

Bigg Boss Season 7  : ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ నేటితో ప్రారంభం కానుంది. ఉల్టా పల్టా అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ఈసారి కొత్తగా ఉండబోతుందంటూ హోస్ట్ నాగార్జున పదేపదే చెప్తూ వస్తున్నారు. ఈ సీజన్ ఖచ్చితంగా ముందు సీజన్స్ లా ఉండదని సరికొత్తగా ఉండబోతుందని సంకేతాలు పంపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రోమో ను కూడా ఇటీవల విడుదల చేసింది బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్ విషయానికొస్తే…దాదాపు 200లకు పైగా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు కాల్స్ చేయగా వారిలో 50 మంది కంటెస్టెంట్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

bigg-boss-season-7-starts-from-today

Advertisement

ఇక ఈ 50 మందిలో హౌస్ లోకి ఎవరు వెళ్లబోతారు అన్నది ఎపిసోడ్ విడుదల అయ్యేంతవరకు సస్పెన్స్ గానే ఉంటుంది. ఎందుకంటే ఈసారి జరగబోయే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ లకి గత సీజన్స్ మాదిరిగా క్వారంటైన్ పరిస్థితులు లేవు. కాబట్టి సో స్టార్ట్ అవుతుందన్నంగా కూడా పేర్లు తారుమారు అవ్వచ్చు. అయితే ఇండస్ట్రీ వర్గాలు మరియు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొంతమంది పేర్లు అయితే బాగా సర్కులేట్ అవుతున్నాయి. అమర్దీప్ ,కార్తీకదీపం మౌనిత ,ఆట సందీప్, ఒకప్పటి హీరో శివాజీ వంటి వారితోపాటు కొత్తగా మరికొన్ని పేర్లు లిస్టులోకి చేరాయి.

Bigg Boss Telugu 7 Contestants: Photos, details of 22 contestants who are going to enter Bigg Boss 7 – here is samayam telugu exclusive guess list of bigg boss telugu season 7 contestants with photos

అయితే ఫైనల్ లిస్టులో దాదాపు 23 మంది ఉండగా 22 మందిని శనివారం రోజు హౌస్ లోకి పంపించారు. ఇక వీరిని ఈరోజు సాయంత్రం లైవ్ ఎపిసోడ్ లో మనకు చూపిస్తారు . ఈ 22 మందిలో ఒకరిని సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం ఉందట. మరి ఆ వ్యక్తి ఎవరన్నది ఎవరికీ తెలియదు. అంతేకాక వారిని వేరే హోటల్లో సీక్రెట్ గా ఉంచడంతో సీక్రెట్ రూమ్ లో ఉండబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. రితిక నాయక్, ఐశ్వర్య పిస్తే వీరిద్దరిలో ఒకరు సీక్రెట్ రూమ్ లో ఉండే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఒకప్పుడు బిగ్ బాస్ షో అంటే సెలబ్రిటీల రియాలిటీ షో. కానీ ఇప్పుడు మాత్రం ఎవరెవరో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. అంతేకాక ఒకప్పుడు వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరుగాంచిన బిగ్ బాస్ , గతేడాది జరిగిన సీజన్ 6 తోవరల్డ్ వరస్ట్ రియాల్టీ షో గా మారింది. ఇక ఇప్పుడు సీజన్ 7 సరి కొత్తగా ఉండబోతుందని మార్పులు చేర్పులు చేశామని ఉల్టా పల్టా అంటూ హోస్ట్ నాగార్జున చెప్పుకొస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

Advertisement