Viral Video : భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువం పై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చారిత్రాత్మక సంఘటనపై పాకిస్తాన్ స్పందనను ప్రపంచమంతా గమనించకుండా ఉండలేకపోయింది. దీంతో తక్షణమే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. తాము ఇప్పటికే చంద్రునిపై జీవిస్తున్నట్లు పాకిస్తానీలు సరదాగా చెప్పుకోవడం నుండి ఏకంగా ఇప్పుడు మనిషిని పంపించడంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతున్న ఓ టిక్ టాక్ వీడియోలో ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిని చంద్రుని పైకి పంపిస్తున్నట్లు వీడియో తీశారు. ఇక ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు ఓ ల్యాబ్ నుండి పనిచేస్తున్నట్లుగా కనిపించారు.
రాకెట్ పట్టుకున్న ఓ వ్యక్తిని టేక్ ఆఫ్ చేయడంతో పాటు హాస్యస్పందంగా దాన్ని జారవిరుచుకోవడం వరకు ఉండడంతో వీడియో ప్రారంభంలోనే నవ్వులతో నిండిపోయింది. ల్యాబ్ లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు అతనికి భరోసా ఇస్తూ ఎలాంటి సమస్య లేదని అక్కడికి చేరుకునే శక్తి మీకు ఉందని అంటున్నారు. ఆ తర్వాత ఓ వ్యక్తిని విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ ద్వారా భూమి నుండి పైకి ఎగురుతున్నట్లుగా చూపించారు. ఇంతలో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్న ఓ వ్యక్తి నమ్మకంగా ఇది సాధ్యం కాదని చెప్పాడు . భారతదేశం మనం ఎప్పటికి చంద్రుని చేరుకోలేమని భావిస్తుందని వారికి మనం చేయగలమని నిరూపించాలి అని చెప్పాడు. అలా నసీం వెళ్తున్న దారి మధ్యలో ఓ సాటిలైట్ కనిపిస్తే దానిని ఏం చేయాలంటూ ల్యాబ్ లో ఉన్న వారిని అడుగుతాడు.
ల్యాబ్ లో ఉన్నవారు అది చైనా శాటిలైట్ అని దానిని ఏం చేయకు ముందుకెళ్లు అని చెబుతారు. అలా నసీం చీకట్లో ఎక్కడో ఊహించని ప్రాంతంలో ముగించినట్లుగా వెల్లడించాడు. ఆపరేటర్ వెంటనే నసీం నరకానికి చేరుకున్నట్లుగా చెప్పాడు. దీంతో నసీం వెంటనే తిరిగి వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చిన నసిం ను ల్యాబ్ లో ఉన్న ముగ్గురు తిరిగి చంద్రుని పైకి పంపిస్తారు.ఇలా చంద్రుని పై నసీం దిగడంతో వీడియో ముగుస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నవ్వప్పుకోలేకపోతున్నారు. అయితే భారతదేశంలో టిక్ టాక్ నిలిపివేసి చాలాకాలమైంది. మరి ఈ వీడియో చంద్రాయన్ 3 ల్యాండింగ్ కు ముందు తీసారా లేదా తర్వాత సృష్టించబడిందా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
Pakistanis are also going to the moon ???? pic.twitter.com/QLW8WWkPh3
— Taimoor Zaman (@taimoorze) August 31, 2023