Bimbisara Movie First Day Collections : బాక్సాఫీస్ వ‌ద్ద మీసం మెలేసిన బింబిసార‌.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

Bimbisara Movie First Day Collections : క‌ళ్యాణ్ రామ్, కేథ‌రిన్, సంయుక్త మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌శిష్ట తెర‌కెక్కించిన చిత్రం బింబిసార‌. ఈ సినిమా బాక్సాఫీస ద‌గ్గ‌ర ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా క‌ళ్యాణ్ రామ్ ఇందులో కనివిందు చేశాడు.ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. ఫ‌స్ట్ షో నుండే మూవీకి మంచి టాక్ రావ‌డంతో జ‌నాలు క్యూ క‌ట్టారు. దీంతో తొలి రోజు చిత్రానికి మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి.

వ‌సూళ్ల సునామి..

బింబిసార మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ట్రేడ్‌లో ఈ సినిమాపై భారీ అంచాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వసూళు చేసిన కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 2.15 కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 1.29 కోట్లు షేర్ ఉత్తరాంధ్ర రూ. 0.90 కోట్లు.. ఈస్ట్ గోదావరి – రూ. 0.43 కోట్లు.. వెస్ట్ గోదావరి – రూ. 0.36 కోట్లు గుంటూరు – రూ. 0.57 కోట్లు కృష్ణా – రూ. 0.34 కోట్లు.. నెల్లూరు రూ. 0.26 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 6.30 కోట్లు షేర్ క‌లెక్ట్ చేసింది.

Bimbisara Movie First Day Collections : బాక్సాఫీస్ వ‌ద్ద మీసం మెలేసిన బింబిసార‌..

Bimbisara movie How much money was collected on the first day?
Bimbisara movie How much money was collected on the first day?

బింబిసార చిత్రం యు.ఎస్‌లో రూ. 48 ల‌క్ష‌లు, క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా రూ. 40 ల‌క్ష‌లు షేర్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 7.08 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్ల ప్ర‌కారం రూ. 11.5 కోట్లు వ‌చ్చాయి. ‘బింబిసార’ సినిమాకు రూ. 16.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమాకు రూ. 17 కోట్లు రావాలి. తొలిరోజునే సినిమాకు రూ. 7.08 కోట్లు షేర్ రావ‌టంపై నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. చూస్తుంటే రానున్న రోజుల‌లో ఈ సినిమా మ‌రిన్ని వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.