Raviteja : మస్ మహా రాజ్ రవితేజ అంటే తెలుగు ఇందిస్టీలో ఇతను అంటే తెలియని వారు ఉండరు. ప్రేక్షకులకు తన మస్ లోక్ తో తన యాక్టింగ్ నైపుణ్యం తో తన ఫ్యాన్స్ కు పండగ చేస్తుంటాడు రవితేజ.రవితేజ తన ప్రతి సినిమాలో తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తు కామిడీ అయిన యాక్షన్ అయిన సెంటిమెంట్ అయిన తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తూ ప్రేక్షకుల హృదయాలలో రవితేజ అంటే ఒక గొప్ప స్థానాన్ని దక్కించుకున్నాడు. మస్ మహరాజ్ గా తానూ చేసే ప్రతి సినిమాకు వైవద్యం చూపిస్తూ ప్రేక్షకులకు తన నటనతో దగ్గర అయ్యాడు.
రవితేజకు ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ ఇందుస్టీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉండేవాడు. తనకు ఇప్పుడు ఉన్న స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా రాలేదు. ఎంతో కష్టపడి, వచ్చినాప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడు ఇతను ప్రొడ్యూసర్లు కు బాక్సాఫీస్ హీరోగా మారాడు. ఇప్పుడు రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తో ప్రేక్షకులను అలరిండానికి సిద్ధం అవుతున్నాడు.రవితేజ రవాణాసుర, టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ మేకింగ్ లో ఉన్నాడు.టైగర్ నాగేశ్వరరావు సినిమాలో చిత్రీకరణలో రవితేజ గాయ పడినట్లు తెలుస్తోంది.
Raviteja : రవితేజకు షూటింగ్ లో ప్రమాదం.

చిత్ర యూనిట్ వారు రవితేజ ను వెంటనే హాస్పిటల్ కు తీసుకుపోగా తన చేతికి పదింకుట్లు పడినట్లు రెండు నెలల వరకు రెస్ట్ కావాలి అన్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఆయన రెండు రోజుల్లోనే కోలుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా స్టుంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఇతర సాంకేతిక నిపుణుల డేట్స్ లో మార్పు రావద్దని, తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడవద్దు అని తను ఇలా చేసినట్లు సమాచారం. ఈ వార్త విన్న తన అభిమానులు కొంత కంగారు పడినప్పటికీ మస్ మహరాజ్ రవితేజ కు ఆరోగ్యానికి ఏటువంటి ఇబ్బంది లేదు అని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. రవితేజ కు తన సినిమాపై వర్క్ లో ఉన్న డెడికేషన్ కు హాట్సప్ చెప్పాల్సిందే అని ఆయన అభిమానులు అంటున్నారు.