Health tips : బియ్యం నీరుని వాడటం వలన చర్మానికి మరియు జుట్టుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బియ్యం కడిగిన నీళ్లను వాడటం వలన ముఖంపై మొటిమలు పోయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది. గంజి , పసుపు కలిపి మొటిమలు మరియు నల్లమచ్చల మీద అప్లై చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.గంజిలో పసుపు కలిపి వాడటం వల్ల బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా బాగా తగ్గి స్కిన్ టోన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. రైస్ వాటర్ ని ఫేస్ టోనర్గా కూడా ఉపయోగించవచ్చు ఇది పిహెచ్ వాల్యూ ని బ్యాలెన్స్ చేసి సన్ నుంచి రక్షిస్తుంది. రైస్ వాటర్ క్యూబ్స్ మొహంపై మసాజ్ చేయడంతో చర్మం గ్లోగా అవుతుంది.చర్మంపై రాషెస్ ని తగ్గించడం కోసం రైస్ వాటర్ ను స్కిన్ కండిషనర్గా కూడా వాడతారు.
రైస్ వాటర్ లో ఉన్న విటమిన్స్ మరియు మినరల్స్ చర్మానికి కాకుండా జట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది, కండీషనర్గా ఉపయోగిస్తారు,చుండ్రు నుండి ఉపశమనం, జుట్టు క్షీణించకుండా నిరోధిస్తుంది. జుట్టు రాలకుండా దృఢంగా, జుట్టు పెరుగుదలకు గంజినీళ్ళు ఎంతో ఉపయోగపడతాయి గంజి నీటిలో ఉండే ఇనోసిటాలు అనే కెమికల్ కాంపౌండ్ వలన జుట్టు రాలకుండా ఉంటుంది అని జపాన్ వారు 2010 పరిశోధన చేసి నిర్ధారించారు. గంజి నీళ్ళలో ఉండే ఇనోసిటాలు జుట్టుని షైన్ గా ఉండి. పగలకుండా చిక్కులు పడకుండా చేస్తుంది. రైస్ వాటర్ న్యాచురల్ కండిషనర్గా పనిచేస్తుంది దీనిని రోజూ ఉపయోగించవచ్చు మంచి ఫలితాలు వస్తాయి.
Health tips :రైస్ వాటర్ వలన కలిగే లాభాలు
జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరగడానికి రైస్ వాటర్ ఎంతో ఉపయోగపడుతుంది. చుండ్రు సమస్యకి,ఈ రైస్ వాటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.బియ్యం కడిగిన నీటిని బాటిల్స్ లో , ఐస్క్యూబ్స్ లాగా నిలువ ఉంచుకోవచ్చు, ఇలా నిలువ ఉంచుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఎండాకాలం బయటికి వెళ్లి రాగానే మన ఫేస్ నలుపు మరియు హెడ్ టెంపరేచర్ ని కంట్రోల్ చెయ్యడానికి మనం నిలువ ఉంచుకున్న ఐస్ క్యూబ్ ని ఫేస్ కి అప్లై చేయడం వలన నలుపు తగ్గి తక్షణ ఉపశమనం ఉంటుంది.అలాగే బాటిల్స్ లో నిలువ ఉన్న నీటిని జుట్టుకి అప్లై చేయడం వలన హెడ్ టెంపరేచర్ కంట్రోల్ అయ్యి, ఉపశమనంగా ఉంటుంది. ఇలా బియ్యం కడిగిన నీటిని నిల్వ ఉంచి ఉపయోగించడం వలన తక్కువ ఖర్చుతో ఎన్నో లాభాలు ఉంటాయి