Tollywood : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి గారు. ఆయన దర్శకత్వంలో చేసిన సినిమా చత్రపతి. ఈ చిత్రం 2005లో విడుదలైంది ఈ సినిమాల్లో ప్రభాస్ శ్రీయ ఇందులో నాయకి నాయకులుగా నటించారు. ఈ సినిమాకు అప్పట్లోనే 30 కోట్ల వసూలను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంతో పెద్ద హిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమాలో ప్రభాస్ నటనతో అందరినీ మెస్మరైస్ చేశాడు అలాగే ఇందులో అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ సూరిడు అనే పేరు అందరి మనసులో నాటుకుపోయింది.
ఈ సూరీడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు ఇలా చాలామంది చాలా సినిమాల్లో నటిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇక ఈ సినిమాలో తన నటనతో అందర్నీ ఆదరాభిమానాలను పొందాడు. ఈ చిత్రం తనకు ఎంతో పాపులారిటీని తెచ్చింది. తను చిన్న వయసులోనే నటించి ఎంతో ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. తన నటనతో అందరికీ గుర్తుండిపోయారు. ఈ కుర్రాడి పేరు భశ్వంత్. తనను అందరు సూర్యుడు సూర్యుడు అనే పేరు సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. ఏ సూర్యుడి పాత్ర అందర్నీ ఎంతలా మెప్పించింది మనకి అర్థమవుతుంది.
Tollywood : ఛత్రపతి సినిమాలో సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా?

తను ఇప్పుడు సినిమాలలో నటించకపోయిన తను అందరికీ గుర్తుండిపోయాడు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మన సూర్యుడు పెరిగి పెద్దయ్యాడు అలాగే ఈ సూర్యుడు అచ్చం హీరోలా ఉన్నాడు. చత్రపతి లో వాళ్ళ అమ్మ కళ్ళు లేని పాత్రలో తనను సూర్యుడు యాడున్నావ్ రా అని పిలుస్తూ ఉంటుంది. ఆ సీను అందరి మదిలో అలా నిలిచిపోయింది. అలా తన పాత్ర చాలా పాపులర్ అయింది. అలా తను ఎంతో క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో పెరిగి పెద్దయ్యాడు ఇప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తన హీరోగా రాబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్ వినిపిస్తుంది.