Health Benefits : పిల్లలకు స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. ఇక తల్లులు పిల్లలకు లంచ్ బాక్స్ చేయడం కష్టమే. ఎందుకంటే పిల్లలు అన్నింటిని ఇష్టపడరు. వారికి నచ్చింది, తినేవి చేయాలని తల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఎదిగే పిల్లలు కనుక వారికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని లంచ్ బాక్స్ లోకి అందించాలి. అప్పుడే పిల్లలు శారీరకంగాను, మానసికంగాను దృఢంగా ఉంటారు. అయితే పిల్లలు ఇష్టంగా తినే పోషకాల ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
1) పిల్లలు ఇష్టంగా తినాలంటే ఆరోగ్యపరంగా కూరగాయల హుమ్ముస్ చాలా మంచిది. కూరగాయలను ఉడికించి చేసే హుమ్ముస్ చాలా రుచిగా ఉంటుంది.ఈ హుమ్ముస్ లో కూరగాయలను ఉడికించడం వలన కూరగాయలోని విలువైన పోషకాలు పిల్లలకు అందుతాయి. హుమ్ముస్ ను చూడగానే పిల్లలు ఎంతో ఇష్టంగా లంచ్ బాక్స్ ను స్కూల్ కి తీసుకు వెళ్తారు. ఈ హుమ్ముస్ ను క్యారెట్, బఠాణీలు ,సెలేరి మొదలగు ఉడికించిన కూరగాయలతో చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.
Health Benefits : రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం
2) పిల్లలు రోజుకు ఒక గుడ్డు తింటే ఎంతో బలం వారి శరీరానికి అందుతుంది. అప్పుడే వారు శారీరకంగా దృఢంగా ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు గుడ్డును అస్సలు ఇష్టపడరు. అలాంటప్పుడు కోడిగుడ్డుతో ఎగ్ బుర్జి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఎగ్ బుర్జిని రోటి, బ్రెడ్, పూరి తో కలిపి లంచ్ బాక్స్ లో పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
3) బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి ఎదిగే పిల్లలు తింటే శారీరకంగా, మానసికంగా గట్టిగా ఉంటారు. కానీ పిల్లలు బీట్ రూట్ ను అస్సలు తినరు. అలాంటప్పుడు బీట్ రూట్ తో పరోటా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
4) అలాగే అవకాడో లో మంచి కొవ్వులు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అవకాడో, దోసకాయ, చీజ్ లతో కలిపి శాండ్విచ్ తయారు చేసి పిల్లలు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కనుక వారికి నచ్చిన విధంగా ఇలా తయారు చేసి లంచ్ బాక్స్ లో పెట్టండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.