Mega154 : మెగాస్టార్ నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా భారీ అంచనాలతో అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన 154 వ సినిమాని యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ కూడా పెట్టారు. అయితే ఈ కొత్త సినిమా షెడ్యూల్ విశాఖపట్నంలో ప్రారంభమైందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ అక్కడే అక్టోబర్ రెండు వరకు కొనసాగనుంది.

ఆ తర్వాత దసరా సందర్భంగా కొంచెం గ్యాప్ ఇవ్వనుంది టీం. కొత్త షెడ్యూల్ అక్టోబర్ 10 న మొదలవుతుంది. ఈ షెడ్యూల్లో రవితేజకు సంబంధించిన షూటింగ్ పూర్తికానుందట. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ 50 కోట్ల మొత్తాన్ని చెల్లించిందని తెలుస్తుంది. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది.
Mega154 : చిరంజీవి కొత్త సినిమా షెడ్యూల్…

మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత నటించినున్నారట. చిరంజీవి డబుల్ రోల్లో కనిపించనున్నారట. అందుకే శృతిహాసన్ తో పాటు సుమలతను కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే సినిమా షూటింగ్ కోసం చిరంజీవి యూరప్ వెళ్లనున్నారని సమాచారం. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి తదితరులు వివిధ పాత్రలో నటించనున్నారు.