Intinti Gruhalakshmi 29 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 29-September-2022 ఎపిసోడ్ 750 ముందుగా మీ కోసం. ఇంట్లో వాళ్లందరూ అమ్మ మీద కోపం తో నువ్వెందుకిలా చేస్తున్నావు అని అభిని ప్రశ్నించడంతో, అభి కుప్పకూలి పొతాడు, తులసి దగ్గరి కెళ్ళి అమ్మా నువ్వంటే నాకిష్టమని, ఎవరు మోసం చేయొద్దని నీ గురించి ఆలోచించే నేను ఇలా మాట్లాడుతున్నాను, నా బాధని నువ్వైనా అర్థం చేసుకో అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటాడు, ఇలా అభి మాట్లాడుతూ ఉంటే, తులసి దగ్గరికి తీసుకుని, నీ బాధ అర్థం అయింది నాన్న, ఇన్ని రోజులకు మనసు విప్పి మాట్లాడావు, నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, నేను కుటుంబానికి తలవంపులు తెచ్చే పని జరగనివ్వను, అలా ఒక వేళ జరిగితే ఈ తులసి ప్రాణాలతోటే ఉండదు అని అంటోంది. ఒకవైపు సామ్రాట్, వాళ్ల బాబాయ్ తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, టీవీ లొ ఏంటి ఇలా చేశారు, అసలే తులసి వాళ్లింట్లో ఏది జరిగినా అభి చాలా రియాక్టవుతాడు, పరిస్థితి ఎలావుందో, ఏంటో అని సామ్రాట్ అంటూ ఉంటారు.
అప్పుడు వాళ్ల బాబాయ్ ఏం జరిగినా తులసి పట్టించుకోనని చెప్పింది కదా అని, ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అభి ఒక్కడే కూర్చుని ఆలోచిస్తూ వుంటాడు, అప్పుడు అంకిత అక్కడికి వచ్చి, సారి అభి నేను నిన్ను అర్థం చేసుకోలేదు అంటూ ఉంటుంది, అప్పుడు అభి నన్ను అందరూ వెలివేశారు, నేను డాడీ ని ఇష్టపడడం నేరంగా చూశారు, ఏది చేసిన దాన్ని తప్పుపట్టారు అని అనగానే, అంకిత అభికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది భోజనం చెయ్యమని, అంకిత స్వయంగా అభికి తినిపిస్తూ ఉంటుంది, ఇలా అభి కోపాన్ని పోగొడుతుంది, తరవాత తులసి వాళ్ల అత్తయ్య కూరగాయలు కొనడానికి బజార్ కి వెళితే, అక్కడ తులసి సామ్రాట్ గురించి టీవీలో వచ్చిన వార్త గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, దాంతో అనసూయకు కోపం వస్తుంది, తరువాత సామ్రాట్ తులసికి ఫోన్ చేసి అడుగుతాడు నిన్న జరిగిన దాని గురించి, మీరేమి టెన్షన్ పడకండి మా ఇంట్లో వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు అని తులసి అంటుంది, ఇలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను రేపు హాని బర్త్డే, మీరందరూ రావాలి అని ఇలా మాట్లాడుకుంటారు కొద్దిసేపు, అప్పుడు తులసి వాళ్ళ అత్తయ్య వచ్చి, ఇంట్లో అందరి ముందు జరిగిన విషయాన్ని చెబుతూ ఉంటుంది.
Intinti Gruhalakshmi 29 September Today Episode : ఇరుగు పొరుగు వారు మాట్లాడిన మాటలకి కోపంగా ఉన్న అనసూయ

బయట ఇలా మాట్లాడుతున్నారు, ఇక చాలు, తులసి ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటోంది, అభి నేను చెప్పాను కదా ఇలాంటిది జరుగుతుందని అభి అంటాడు, అనసూయ మాటలకి ఇంట్లోవాళ్లు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అనసూయ మాటలను అందరూ వ్యతిరేకిస్తారు, అభి మాత్రం సమర్థిస్తాడు, తులసి అక్కడికి రావడంతో, అందరూ సైలెంటుగా ఉండిపోతారు ఏమీ జరగనట్టు, ఏమి జరిగింది అని తులసి అనగానే, ఏం లేదు అంటీ అమ్మమ్మ గారి మోకాళ్ల నొప్పుల గురించి మాట్లాడుతున్నాం అని అంటోంది, తులసి చెప్పడం మర్చిపోయానని, నాకు సామ్రాట్ గారు ఫోన్ చేశారు, రేపు మన హనీ బర్త్డే ఉన్నది అని అనగానే, మన హాని ఏంటి, నవ మాసాలు మోసి కన్నటు ఏంటి అలా అన్నావు అంటూ కోపంగా అనసూయ మాట్లాడుతూ ఉంటుంది, ఏమైంది అత్తయ్యా అని అనగానే, అదేదో చిరాకుగా ఉందిలే అమ్మ మోకాళ్ళ నొప్పులతో, నువ్వు వాళ్ళు ఆఫీసుకి అని వాళ్ళ మామయ్య తులసిని వెళ్లమంటాడు. తర్వాత ఆఫీస్లో తులసి అందరి చేత పనులు చేయిస్తూ ఉంటే, ఇంట్లో ఏదడిగితే అది తెచ్చిపెట్టేది, ఇప్పుడింత వైభోగం వచ్చింది అంటూ లాస్య నందు తొ తులసి గురించి మాట్లాడుతూ ఉంటుంది, ఇంతటి ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ నడుస్తోంది.