Suma Kanakala : ప్రతి మనిషి తన జీవితంలో ఏం సాధించాలనుకుంటాడో అది ఎంతవరకు సాధించగలడో ఎవరికి తెలియదు.ఎక్కడో ఎవరో కొందరు మాత్రమే వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. అయితే అలాంటి వారిలో సుమా కనకాల ఒకరని చెప్పుకోవాలి. అయితే మొదట సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని వచ్చిన సుమా సినిమాలలో కలిసి రాకపోవడంతో ఏమాత్రం కుంగిపోకుండా తన టాలెంట్ ను తానే గుర్తించి దాని పరంగానే ముందుకు సాగి ఈరోజు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ యాంకర్ గా నిలిచింది. ఇక సినీ ఇండస్ట్రీలో ఏవైనా పెద్దపెద్ద వేడుకలు జరగాలంటే కచ్చితంగా సుమా డేట్స్ చూసుకుని కార్యక్రమాన్ని నిర్దేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాక సుమా వయసు పెరుగుతున్నప్పటికీ ఆమె అందంలో కానీ కంఠంలో కానీ ఎలాంటి మార్పు రాలేదు.
ఆమె మాట తీరు సమయస్ఫూర్తి ఎంతో ఆకర్షణీయంగా మాట్లాడే ఆమె మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే ఆమె యాంకరింగ్ చేసే సమయంలో ఎవరినైనా కామెంట్ చేసినా సరే అది చాలా ఆనందదాయకంగా ఉంటుంది.అంతేకాక ఎవరిని నొప్పించకుండా చాలా అద్భుతంగా సుమా యాంకరింగ్ చేయగలరు. అయితే కెరియర్ పరంగా సుమ ఎంత గొప్పగా సక్సెస్ అయ్యారో తన లైఫ్ లో కూడా అంతే సక్సెస్ అయ్యారు. రాజీవ్ కనకాల కి ఉత్తమ ఇల్లాలుగా వ్యవహరిస్తూ ఎంతో చక్కగా పిల్లల్ని పెంచి ఇప్పుడు కొడుకుని కూడా హీరో ని చేసింది. అంతేకాక సుమా తన భర్తకి ఇచ్చే గౌరవం పిల్లల్ని పెంచే తీరు చాలామందికి స్ఫూర్తిదాయకమని చెప్పాలి. ఒకవైపు తన పని తాను చేసుకుంటూనే తన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దటమంటే మామూలు విషయం కాదు కదా. అయితే తాజాగా సుమా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వైరల్ గా మారాలి. ఇంటర్వ్యూలో భాగంగా సుమా మాట్లాడుతూ…
ఎంతోమంది ఆడవారు భర్తలు చనిపోయిన తర్వాత ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. మరికొందరికి కనీసం బ్యాంక్ అకౌంట్ అనేది కూడా లేకుండా కష్టాలు పడుతూ గడుపుతున్నారు. ఇక నా పిల్లలకైతే నేను ప్రతి విషయాన్ని వెల్లడిస్తాను. ముఖ్యంగా నేను చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. వాటిని ఎలా తీసుకోవాలి కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే అంశాలను ముందుగానే చెప్తాను. నా పిల్లలు ఇలాంటి మాటలు ఎందుకు చెప్తావని అన్న లేదు ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే మీకు అన్ని తెలిసి ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం సుమా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. , అయితే సుమా చేసిన వ్యాఖ్యలు విన్న నేటిజనులు ఆమె ముందు జాగ్రత్తకు మంచిగా స్పందించినప్పటికీ ముందే చనిపోతానని భయపడడం బాలేదంటూ ఇలా మాట్లాడకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.