Dog Bites Care : మనుషులు ఎంతో ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువులలో ముందుగా కుక్కలే ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయింది కానీ పూర్వం రోజుల్లోనే చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో కూడా చాలామంది వారి ఇండ్లలో కుక్కలని పెంచుకుంటున్నారు. ఇక అవి చనిపోయేంతవరకు చాలా విశ్వాసంగా ఉంటాయి. అయితే ఎంత జాగ్రత్తగా ప్రేమగా పెంచుకున్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో కుక్కలు ఎవరినో ఒకరిని కరుస్తుంటాయి. ఇక ఇలాంటి సమయంలో ఇంట్లో పెంచిన కుక్కే కదా ఏం కాదులే అనుకుంటే పొరపాటే. ఇంట్లో కుక్క అయినా వీధిన కుక్క అయినా కరిచినప్పుడు రేబిస్ వ్యాధి సోకే అవకాశం కచ్చితంగా ఉంటుంది.
దీని కారణంగా మెదడులో మంట ,మనిషి కుక్కల ప్రవర్తించడం జరుగుతుంటుంది. మరి కుక్క కరిచిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కుక్క కరిచిన వెంటనే మొదటిగా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ చేయటం వలన రేబిష్ వైరస్ అనేది త్వరగా మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటుంది. కావున కుక్క కరిచిన వెంటనే ఏదైనా సబ్బుతో వెంటనే గాయాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిని వేడి చేసి గోరువెచ్చటి నీటిని 10 నిమిషాల పాటు గాయం పై పోస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన వైరస్ శరీరంలోకి త్వరగా ప్రవేశించదు. ఇక గోరువెచ్చని నీరు పోయడం వలన బ్యాక్టీరియా అనేది శరీరంలోకి ప్రవేశించకుండా నశిస్తుంది.
అనంతరం శుభ్రమైన గుడ్డతో గాయాన్ని రక్తం కారకుండా మెల్లిగా తుడవాలి. అందుబాటులో యాంటీబయోటిక్ క్రీమ్ ఉన్నట్లయితే కరిచిన చోట వెంటనే రాసుకోవడం మంచిది. అనంతరం స్టైల్ బ్రాండేజ్ ని గాయం చుట్టూ మెల్లగా కట్టి ఉంచాలి. అనంతరం వైద్యుని సంప్రదించవచ్చు.అయితే కుక్క కరిచిన ఘాట్లను మరియు గాయం లోతును పరిశీలించి వైద్యులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.అలాగే కుక్క కరిచినప్పుడు రోజుకి రెండు లేదా మూడుసార్లు బ్యాండేజ్ లు మారుస్తూ గాయాన్ని పరిశీలిస్తూ ఉండాలి. దురద వచ్చిన ,జ్వరం వచ్చిన, నొప్పిగా ఉన్న వెంటనే డాక్టర్ లు చెబుతూ ఉండాలి. అలాగే డాక్టర్ ఏదైనా ఇంజక్షన్ సూచిస్తే వెంటనే తీసుకోవడం మంచిది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.