Samantha : సమంత విషయంలో తాను ఒకటి తలిస్తే మరొకటి జరిగింది. పెళ్లి చేసుకొని హ్యాపీగా గడపాలి అనుకున్న సమంత నాగచైతన్య అనుకోకుండా విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నారు. నాలుగేళ్లు బాగానే ఎంజాయ్ చేసిన బిడ్డల్ని కనలేకపోయారు. రీజన్ ఏంటో వాళ్లకే తెలియాలి. అయితే సమంత విడాకులు తీసుకోవడంపై సినీ ఇండస్ట్రీలో కొత్త రూమర్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు సమంతకు తన స్టైలిష్ తో అఫైర్ ఉందని, మరొక హీరో పై మోజు ఉందని అందుకే నాగచైతన్యతో విడాకులు తీసుకుందని వార్తలు వచ్చాయి. దీంతో అక్కినేని అభిమానులు సమంతా పై మండి పడ్డారు. అయితే రీసెంట్ గా ఓ కొత్త రూమర్ పుట్టుకొచ్చింది.
ఎందుకంటే అక్కినేని ఇంటి బిడ్డ ఉసురు తలగడం వల్లే సమంత విడాకులు తీసుకున్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ గురించి అందరికీ తెలిసిందే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. కారణాలు ఏంటో తెలియదు కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడికి దూరమై ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సుప్రియ కొత్త లవ్ స్టోరీ నడిపిందంటు వార్తలు వచ్చాయి. యంగ్ హీరో అడవి శేషు తో సుప్రియ ప్రేమలో ఉందని పెళ్లి కూడా చేసుకుంటారని ఓ రూమర్ బయటకు వచ్చింది.

Samantha : ఆమె ఉసురే సమంతకు తగిలిందా…
అయితే ఈ పెళ్లిని పరోక్షంగా సమంత అడ్డుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మొదటినుంచి సుప్రియ కు సమంతా కు పెద్దగా పడదట. ఆ కారణంగానే ఈ పెళ్లికి సమంత ఒప్పుకోలేదని పెళ్లి మాట ఎత్తగానే అడవి శేషు సుప్రియ కి కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే వాళ్ళిద్దరూ పెళ్లిని ఆపేసారట అక్కినేని ఫ్యామిలీ. ఇప్పుడు ఆ ఉసురు తగిలే తన భర్తకు దూరమై సమంత కూడా సింగిల్ గా తనలాగే బతుకుతుంది అంటూ సుప్రియ తన ఫ్రెండ్స్ తో చెప్పుకొచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజ నిజాలు ఏంటో మనకి తెలియదు.