‘అల్లరి’ నరేష్ ను మించి పోయిన ‘అల్లరి పిల్ల’ ఎవరో తెలుసా?

ఒకప్పుడు అక్కేనేని నాగేశ్వర రావు, ఎన్ టి రామారావు, డి రామానాయుడు లాంటి తమ పిల్లలను సినిమాల షూటింగ్ లు చూడ నిచ్చే వాళ్ళు కాదు. వాళ్లు చువులు పూర్తీ చేశాకే సినిమాల్లో నటించాలి అని చాలా కటినంగా ఉండే వాళ్ళు. అందకే డిగ్రీ లు పూర్తి చేశాకే నాగార్జున, బాల కృష్ణ, వెంకటేష్ లను హీరోలుగా మార్చారు. కానీ నేడు ట్రెండ్ మారింది.

Advertisement

నేటి హీరోలో తమ పిల్లలను చిన్నప్పటినుంచే నటింప జేస్తున్నారు. చదువుకంటే సినిమాల్లోనే జీవితం ఉందని తెలుసుకున్నారు.ల అందుకే అల్లు అర్జున్ తన కూతుర్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి దింపారు. ఇప్పుడు అదే కోవలో అల్లరి నరేష్ కూడా తన నాలుగేళ్ల కూతురిని సినిమా రంగంలోకి దింపారు. అతను నటిస్తున్న ఉగ్రం సినిమాలో ఈ పాపా ముఖ్య పాత్ర పోషితోంది. సాధారనంగా అల్లరి నరేష్ సెట్లో ఉంటే అల్లరే అల్లరి.

Advertisement

ఇక ఈ పాపా తండ్రిని మించి సెట్ లో అల్లరి చేస్తోంది. షార్ట్ లో తండ్రికే ఆక్షన్ నేర్పుతోందో. ఎలా నటించాలో నరేష్ కి చూపిస్తోంది. డైరెక్టర్ కంటే ముందే ‘ఆక్షన్, కట్ లు చెప్పి షాక్ ఇస్తోంది. అంటే కాదు, ప్రెస్ తో ముచ్చటించింది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏ మాత్రం తడబడకుండా తన చిలుక పలుకులతో జవాబులు చెప్పింది.

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న పాపా తన స్పీచ్ తో అద్దరగొట్టింది. అంతే కాకుండా తన ముద్దు ముద్దు మాటలతో సినిమా ప్రమోషన్ చేస్తూ ”ఈ సినిమాలో మా నాన్న కంటే నేనే చాలా బాగా యాక్టింగ్ చేశాను. మీరు కచ్చితంగా సినిమా చూడాలి. ఐ లవ్ యు మై డాడీ. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్ అంకుల్ కి థాంక్స్. ఈ సినిమాను నా కోసమైనా మీరు చూడండి ప్లీజ్” అంటూ షాక్ ఇచ్చింది.

ఇక చివర్లో ”నువ్వు పేద్దగయ్యాకా ఏమవుతావు?” అని యాంకర్ ప్రశ్నించింది.

”నేను పెద్దయ్యాక సమంత అవుతాను” అని అందర్నీ నవ్వించింది.

అయితే అల్లరి నరేష్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్. అతను తొలిసారి ‘సీతారత్నంగారి అబ్బయి” సినిమాలో నటించి ప్రెస్ ముందు ఇలాగే మాట్లాడి నేను పెద్దగయ్యాకా చిరంజీవి ని అవుతాను అని నాడు షాక్ ఇచ్చినట్లు ఆ సినిమాకు పని చేసిన రచయిత దురికి మోహన రావు చెప్పారు. దీంతో అల్లరి నరేష్ కూతురు ముద్దుగా ఉందని చాలా మంది అభిమానులుగా మారారు.

Advertisement