Prabhas Salaar : సలార్ సినిమాపై సందిగ్ధం…. రిలీజ్ డేట్ ఎప్పుడు…?

Prabhas Salaar :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ సినిమా సలార్…ఈ సినిమాకు కేజిఎఫ్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో ప్రస్తుతం సినీ బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చాలా బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపద్యంలో తేరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తామని సిని బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరల సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

doubt-on-the-movie-salaar-when-is-the-release-date

Advertisement

సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ ఇంకా కంప్లీట్ కాలేదని ….దీంతో రిలీజ్ డేట్ ను డిసెంబర్ కు వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఆ సమయానికి టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేవు…కనుక దీనిని సంక్రాంతికి వాయిదా వేస్తే మాత్రం మరో ఐదు సినిమాల తో భారీ పోటీ ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాలు డేట్స్ ప్రకటించి వేచి చూస్తున్నాయి. సలార్ కూడా సంక్రాంతికి బరిలో దిగితే మిగతా సినిమాల సంగతి కకావికలమవుతుందని చెప్పాలి. ఇక ఈ 5 సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంటుంది. అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారం ,రవితేజ ఈగల్ , ప్రశాంత్ వర్మ హనుమాన్ , నాగార్జున నా స్వామి రంగా , విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు ఉన్నాయి.

అయితే సలార్ సినిమా కూడా సంక్రాంతికి బరిలో దిగితే వీటిలోని చాలా సినిమాలు తమ డేట్ మార్చుకోవాల్సిందే. ఇది ఇలా ఉంటే సలార్ పోస్ట్ పోన్ తో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫ్రీ ఫోన్ అయి సలార్ ప్లేస్ లో రానుంది. అయితే వాస్తవానికి సలార్ టీం మాత్రం ఇంతవరకు సినిమా వాయిదా గురించి అధికారికంగా ప్రకటించలేదు. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఒక్కోసారి నిజమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే…

Advertisement