Kidney Stones : మానవ శరీరంలో గుండె, కిడ్నీలు, లివర్ అనేవి చాలా ముఖ్యమైన అంగాలు. ఇక వీటిలో ఏ ఒక్కటి విఫలమైనా అది ప్రాణాంతకం అవుతుంది. ముఖ్యంగా కిడ్నీలు అనారోగ్యం అంటే అనేక రకాల వ్యాధులు చుట్టుముట్టినట్టే. అయితే ఈ కిడ్నీలలో చాలా సమస్యలు వస్తుంటాయి. కానీ ముఖ్యమైనది మాత్రం కిడ్నీలో రాళ్ల సమస్య. అయితే మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడనేది అనారోగ్యం పాలైనప్పుడు తెలుస్తుంది. అలాగే కిడ్నీలు సక్రమంగా పనిచేసినంతకాలం వాటి విలువ ఎవరికి తెలియదు. కానీ దానిలో ఒక్కసారి సమస్య వస్తే జీవితమే తలకిందులు అవుతుంది.
ప్రస్తుతం మారిన జీవనశైలిలో భాగంగా వివిధ రకాల ఆహారపు అలవాట్ల వలన కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చాలామంది జంక్ ఫుడ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ ,ఆయిల్ ఫుడ్స్ కు అలవాటు పడిపోయారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కడుపులో జీర్ణం కాకుండా కిడ్నీలో వ్యర్ధాలుగా పేరుకుపోతున్నాయి. అలా కిడ్నీలో పేరుకుపోయిన వ్యర్ధాలు రాళ్ళలాగా మారుతున్నాయి. ఇక కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చిందంటే ఆ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడం వలన పొత్తికడుపులో నొప్పి రావడం, మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని , తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన అది కిడ్నీల పని తీరును మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి సరిపోయే నీటిని క్రమం తప్పకుండా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వలన కూడా కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవుతుంది. కావున రోజులో కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగటం మంచిది. అలాగే ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన అది కిడ్నీలో పేరుకుపోయి రాళ్ల లాగా మారే అవకాశం ఉంది. శరీరంలో ఒక్కసారి ఈ సమస్య వచ్చినట్లయితే వెంటనే చికిత్స చేయించుకోవడం మంచిది లేకుంటే ప్రాణానికి ప్రమాదం.
గమనిక : ఈ సమాచారాన్ని నిపుణుల అంచనాలు మరియు అధ్యయనాల ఆధారంగా రూపొందించాం. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.