Gopi Chand : గోపీచంద్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించడమే కాకుండా విలన్ పాత్రలో కూడా తన విలనిజం చూపించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ మధ్యకాలంలో గోపీచంద్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా భారీ డిజాస్టర్ అవుతున్నాయి.దీంతో గోపీచంద్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా గోపీచంద్ శ్రీను వైట్లతో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.
గోపీచంద్ సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎవరు ముందుకు రావడం లేదట. ఈ తరుణంలో గోపీచంద్ సినిమా అవకాశాలను కోల్పోతున్నారు.అయితే సినిమా అవకాశాలను అందుకుని ఎలాగైనా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలని గోపీచంద్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో తన రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు చాలా వెసులుబాటు కల్పించారని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ముందుకెళ్లేందుకు తన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకున్నట్లు అర్థమవుతుంది.
అంతేకాక సినిమాలో నటిస్తే తనకు రెమ్యూనిరేషన్ ఒకేసారి కాకుండా నెలల వారీగా సాలరీ రూపంలో ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించారు. ఇలా సినిమా కోసం తాను ఎన్ని నెలలు అయితే పనిచేస్తారో అన్ని నెలలు తనకు రెమ్యూనిరేషన్ సాలరీ రూపంలో ఇస్తే చాలని నిర్మాతలతో డీల్ కుదుర్చుకున్నారట. ఇలా అయినా తనకి సినిమా అవకాశాలు వస్తాయని ,అలా సక్సెస్ సాధించడం కోసమే గోపీచంద్ తన రెమ్యూనరేషన్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పాలి. ఇలా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకునేందుకు గోపీచంద్ తీసుకున్న నిర్ణయం తెలిసి అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.