Asia Cup 2023 : మీయాన్ మ్యాజిక్…..ఆసియా కప్ ను ముద్దడినా భారత్….

Asia Cup 2023 : టీమిండియా ఇప్పటికే 7సార్లు ఆసియా కప్ ట్రోపీ ని సాధించగా తాజాగా మరో ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల జరిగిన భారత్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్ భారీ విజయాన్ని సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 51 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.1 ఓవర్లలో చేదించి రికార్డును నెలకొల్పింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తోలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఆ నిర్ణయం ఎంత తప్పో మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అందరికీ అర్థమైంది. భారత్ బౌలర్లకు పిచ్ సహకరించడంతో శ్రీలంక బ్యాటర్లు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

Advertisement

india-won-the-asia-cup-for-8th-time-break-multiple-records

Advertisement

పరుగులు చేయడం మాట పక్కన పెడితే కనీసం వికెట్లను కాపాడుకోలేకపోయారు. అయితే మొదటి ఓవర్లో భూమ్రా …కుశాల్ ను పెవిలియన్ కు చేర్చాడు. అనంతరం హైదరాబాది సిరాజ్ హవా మొదలైంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. సిరాజ్ బౌలింగ్ వేస్తున్నాడంటే వికెట్ వస్తుంది అనేంతలా సిరాజ్ బౌలింగ్ సాగింది. కేవలం 12 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయిన శ్రీలంక తిరిగి కోలుకోలేకపోయింది. అలాగే హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీయడంతో శ్రీలంక 15.2 ఓవర్లకు గాను కేవలం 50 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.

india-won-the-asia-cup-for-8th-time-break-multiple-records
అనంతరం భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని చేదించింది……స్వల్ప స్కోర్ అవడంతో తొలిత బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మ కి బదులుగా ఇషాన్ కిషన్ కు ఓపెనర్ గా అవకాశం ఇచ్చారు. ఓపెనర్స్ గా దిగిన ఇషాన్ కిషన్ మరియు శుబ్ మన్ గిల్ బౌండరీలతో రెచ్చిపోయి 6.1 ఓవర్లలో నిర్దేశిత లక్ష్యాన్ని చేదించి భారత్ కు విజయాన్ని అందించారు. ఇషాన్ కిషన్ 18 బంతులలో 23 పరుగులు చేయగా , శుబ్ మన్ గిల్ 19 బంతులలో 27 పరుగులు చేయారు. మరో 263 బంతులు ఉండగానే టీమిండియా విజయం సాధించడం గమనార్హం. అయితే వచ్చే నెల 5 నుండి వరల్డ్ కప్ ప్రారంభమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కు ఇంతటి ఘన విజయం ఎనలేని ధైర్యాన్ని తెచ్చిపెడుతుందని చెప్పాలి..

Advertisement