Thulasi : గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి నిజ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు

Thulasi : గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్ తులసి అసలు పేరు కస్తూరి. కస్తూరి 15 జూన్ 1976 వ సంవత్సరంలో చెన్నైలో జన్మించింది. కస్తూరి తమిళ అమ్మాయి. కస్తూరి అమ్మగారి పేరు సుమతి, తల్లి న్యాయవాదిగా పని చేస్తుంది. కస్తూరి తండ్రిగారి పేరు శంకర్, తండ్రి ఇంజినీర్ గా పనిచేశారు. కస్తూరికి 2000 సంవత్సరంలో వివాహం జరిగింది కస్తూరి భర్తపేరు రవికుమార్, ఆమె భర్త అమెరికాలోని డాక్టర్ గా పనిచేస్తున్నారు. కస్తూరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి పేరు శోభిని, అబ్బాయి పేరు సంకల్ప్. చదువుకుంటున్న సమయంలోనే కస్తూరికి మోడలింగ్ పై ఇంట్రస్ట్ ఉండటంతో మిస్ మద్రాస్ పోటీలో పాల్గొని విన్నర్ గా నిలిచింది.

చిన్నతనం నుంచి నటన వైపు ఇంటరెస్ట్ ఉండటంతో మోడల్ గా, యాంకర్ గా, హీరోయిన్ గా ఇలా అన్ని రంగాలలోనూ కస్తూరి రాణించింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, భాషల్లో నటించింది. నటన విషయానికి వస్తే కస్తూరి మొదట తన కెరియర్ ను తమిళ ఇండస్ట్రీ ద్వారా స్టార్ట్ చేసింది, నటిగా తమిళ్లో చాలా సినిమాల్లో కస్తూరి నటించి, తమిళ ప్రేక్షకులను మెప్పించింది . మన తెలుగులో బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తరవాత మెరుపు, ఆకాశవీధిలో, చిలకకొట్టుడు, భారతీయుడు, సోగ్గాడి పెళ్లాం, డాన్ శీను, అన్నమయ్య, గాడ్ ఫాదర్ ఇలా పలు సినిమాల్లో కస్తూరి నటించి తెలుగు లో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Thulasi : గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి నిజ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు

Gruhalakshmi serial actress Tulsi interesting things in real life
Gruhalakshmi serial actress Tulsi interesting things in real life

పెళ్లి తర్వాత నటనకు కొన్నాళ్లు దూరంగా ఉంది. హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కస్తూరి తన వివాహం జరిగిన తర్వాత తను మూవీస్ కి, తన ప్రొఫెషనల్ లైఫ్ కి కొంత గ్యాప్ ఇచ్చింది. ఒక ప్రముఖ షోలో కస్తూరిని దానికి కారణం అడగగా, ఆమె అప్పుడు తాను ఎంతో ఎమోషనల్ గా సమాధానం ఇచ్చింది. తన జీవితంలో మూడుసార్లు చచ్చానని, చాలా బాధ పడ్డానని తల్లి, తండ్రుల మరణం, అలాగే తన కూతురికి జబ్బు చేసినప్పుడు, అని చెప్పింది. కస్తూరికి మొదట పాప, తర్వాత బాబు అయితే పాపకు జబ్బుచేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కస్తూరి తన భర్త కి, చిన్న వయసులో ఉన్న బాబుకు, కుటుంబానికి దూరంగా ఉండి పాప దగ్గరే అంటూ తనకి ఆరోగ్యం మెరుగుపడటానికి తల్లిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించానని చెప్పింది.

జీవితంలో ఎన్నో కష్టాలను చూసిన కస్తూరి తనకు తాను ధైర్యం చెప్పుకుంది. మళ్లీ తన ప్రొఫెషనల్ లైఫ్ ని స్టార్ట్ చేయాలి అని, తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. 2019 లో తమిళ బిగ్ బాస్ షో లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో అడుగుపెట్టింది . ఈ షో ద్వారా కస్తూరికి తమిళ్ లో మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో తులసి గా నటిస్తూ, తన అమాయకపు నటన తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రతో నిజజీవితం లో ఒక గృహిణి ఎలా ఉంటుందో, సమయానికి అనుగుణంగా, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో, అని చెప్పే విధంగా మంచి సీరియల్ తో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయ్యింది కస్తూరి.