Health Tips : గర్భం వచ్చిన తరువాత కోన్ని నేలలు నిండుతున్న కోద్ది గర్భిణీలకు కాళ్లు వాపులు వస్తాయి. ఉదయం లెచ్చిన వెంటనే మములుగా వున్న ఈ సమస్య సాయంత్రం వరకు పెరుగి ఇబ్బంది పెడుతుంది కాళ్లు వాచి బిగపట్టేసినట్టు వుండి చికాకు గురి అవుతారు. ఇలా వున్నప్పుడు ఎక్కువ సేపు కూర్చున్న నిలబడ కాళ్లు లాగుతాయి. గర్భిణీ సమయంలో వచ్చే కాళ్లు వాపులు గురించి గైనకాలజి స్పెషలిస్టు పద్మ పాతూరి పలు విధలుగా వెల్లడింటారు. గర్భిణీలలో కొద్ది రొజులు వరకు కాళ్లు వాపులు సాధారణంగా కనిపిస్తాయి. ఆ తరువాత 8,9 నెలల్లో ఈ సమస్య ఎక్కువగా వుంటుంది.
గర్భసంచి లో బేబి బరువు వల్ల కాళ్లు వాపులు వస్తాయి. ఈ సమస్యను తేలికగా తీసుకోవద్దు అని గైనకాలజిస్ట్ తేలియజేసారు. ఇలా కాళ్లు వాపులు రాగానే వైద్యనిపుణులను కలిసి ఈ సమస్య గురించి వివరించాలి. కాళ్లు వాపులు కోద్ది మంది గర్భిణీలలో సాధారణంగా కనిపిస్తాయి. మరి కోద్ది మంది గర్భిణీలలో ఎక్కువగా కనిపిస్తాయి. కాళ్లు నోక్కితే సోట్ట పడి మళ్లి మములు స్దితికి రావటానికి సమయంపడుతుంది. ఇలా వున్నప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి ఎర్రగా, నీలం రంగులో కనిపించడం, కాళ్లు లాగడం వంటి సమస్యలు వుంటే వంటనే గైనకాలజిస్ట్ దగ్గరకు వేళాలి. రెండు కాళ్లు వాపు వస్తే సాధారణం. కాని ఒక కాలు వాపు వస్తే ఆజాగ్రత్తగా వుండవద్దు.
Health Tips : గర్భిణీలకు కాళ్లు వాపులు వస్తున్నాయా…… అయితే ఈ వాపులకు చెక్ పెట్టడం ఇలా…

గర్భిణీలలో ఉండవల్సిన దాని కన్న తక్కువ రక్తం ఉన్నప్పుడు రక్తపోటు పెరిగినప్పుడు ఇటువంటి సమయంలో కాళ్లు వాపు కనిపిస్తాయి. గర్భం దాల్చడానికి ముందు ఆరోగ్య సమస్యలు షుగర్, బీ పీ,గుండె జబ్బులు వున్నవారిలో కాళ్లు వాపులు ఆధికంగా వుంటాయి. గర్భిణీలకు కాళ్లు వాపు తగ్గటానికి గైనకాలజిస్ట్ లు కొన్ని సలహలు ఇస్తారు. కోద్ది సేపు నడవడం కొద్దిపాటి ఎక్స్ సైజ్ లు యెగా లాంటివి చేయాలి కాళ్లు వాపు వస్తే కాళ్లు క్రింద దిండుని పెట్టుకోని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ సేపు కదలకుండ ఒకే చోట కూర్చునప్పుడు, క్రిందికి వేలాడువేసినపుడు వాపు వస్తాయి. అటువంటి సమయంలో కాళ్లుని కాస్త పైకి పెటుకోవాలి. డాక్టర్ ఇచ్చిన సాక్స్ లు మాత్రమే వాడాలి.