Guppedanta Manasu 20 October 2022 Episode చిన్ని తెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 586 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రిషి దేవయాని కలిసి కార్లో వస్తుండగా.. దేవయాని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రిషి కార్ పక్కకి ఆపి ఏమైంది పెద్దమ్మ అని అడగగా దేవయాని డ్రామా ప్లే చేస్తూ ప్రేమ వర్షం కురిపిస్తూ ఉంటుంది రిషి పై. అప్పుడు రిషి నువ్వేం బాధపడకు పెద్దమ్మ మన ఇంటి కోడలుగా తప్పకుండా వస్తుంది.మా ప్రేమే మమ్మల్ని గెలిపిస్తుంది. మా ప్రేమే ఒక్కటి చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు దేవయాని షాక్ అవుతుంది. కట్ చేస్తే మహేంద్ర జగతి కాలేజీ లోకి వెళ్లి గౌతమ్ ని రిషి ఎక్కడ అని అడుగుతూ ఉంటారు.
అప్పుడు రిషి రాత్రంతా క్యాంపస్ లోనే ఉన్నాడు. కానీ వసుధార ఫోన్ చేసింది హడావిడిగా వెళ్లిపోయాడు ఏం జరిగిందో తెలీదు అని అంటూ ఉంటాడు. అప్పుడు అవునా అని కంగారుపడుతూ ఉండగా.. వసుధార వస్తూ ఉంటుంది అప్పుడు జగతి వసుధారాన్ని పిలిచి రిషి ఎక్కడున్నాడో తెలుసా అని అడగగా… అప్పుడు నా దగ్గరికి వచ్చారు దేవయాని మేడం గారు కూడా వచ్చారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర, జగతి దేవయాని అక్కయ్య నీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఏమైనా గొడవ చేసిందా అని కంగారు పడుతూ ఉండగా.. వసుధార ఏం గొడవ చేయలేదు ప్రశాంతంగా ఉన్నారు. నన్ను ఇలా అన్నారు అని జరిగిందంతా వాళ్లతో చెప్తుంది. అప్పుడు జగతి దేవయాని అక్కయ్య ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత సంచలన సృష్టిస్తుంది ఆమె గురించి నీకు తెలియదు అని చెప్తూ ఉంటారు.

అప్పుడు వసుధార అలా ఏం లేదు సార్ వచ్చి మేడంని తీసుకొని వెళ్లారు అని చెప్తూ ఉండగా.. జగతి కోపంగా గురుదక్షిణ విషయాన్ని అక్కయ్యతో చెప్పించుకుంటున్నావా? ఇక ఆ విషయాన్ని నువ్వు వదలవా మనుషులు ఇక్కడ ఎంత బాధ పడుతున్నారు దానిని నువ్వు చూడవా అని కోపంగా తిడుతూ ఉంటుంది. అప్పుడు వసుధర నాకు నమ్మకం ఉంది మేడం రిషి సార్ మారుతాడు. అన్నట్లుగా చెప్తూ ఉంటుంది. ఇక జగతి నమ్మకం నమ్మకం అంటావు మనుషులు ఎంత బాధ పడుతున్న పట్టించుకోవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వసుధర గౌతం కి మీరైనా రిషి సార్ తో మాట్లాడండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు గౌతం నేను కూడా మాట్లాడుతూనే ఉన్నాను కానీ నువ్వు ఎంత మొండి దానివో వాడు కూడా అంతే మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రవర్తన వల్ల మీకు మీ ప్రేమకి ఎక్కడ భంగం కలుగుతుందో అని భయమేస్తుంది. అని అంటాడు అప్పుడు వసుధర ని నేను ఎప్పటికీ వదులుకోను మేమిద్దరం కలుస్తామని గట్టిగా చెబుతుంది. అప్పుడు గౌతం ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహేంద్ర ఇదంతా నా వల్లే జరిగింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వసుధరా మీరు కూడా అలా మాట్లాడకండి సార్ అని ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రిషి పక్కన దేవియాని కూర్చుని ఉంటుంది. అప్పుడు రిషి పెద్దమ్మ ఎక్కడ ఎంతసేపు కూర్చుంటారు. వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు.
కానీ దేవయాని మాత్రం ప్రేమ వలకపోస్తూ నాకు అన్ని నువ్వే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే జగతి మహేంద్ర కార్లో వస్తు ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుంది వదిన రోజురోజుకి ఎంతో భయంకరంగా తయారవుతుంది నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు జగతి అక్కయ్య నిజస్వరూపాన్ని తెలుసుకునే టైం వచ్చింది రిషి. నువ్వు కంగారు పడకు అని ధైర్యం చెబుతూ ఉంటుంది. కట్ చేస్తే రిషి వసుధారాలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తూ మెసేజ్లు పెట్టుకుని కలుద్దాం అని అనుకుంటూ ఉంటారు. ఇక జగతి , మహేంద్ర ఇంటికి వస్తూ ఉండగా.. దేవయాని వాళ్ళని ఆపి మీ పనులు అయిపోయాయా అని ఎటకారంగా మాట్లాడుతూ అసలు రిషిని పట్టించుకుంటున్నారా అని అంటూ ఉంటుంది. మహేంద్ర పట్టించుకోకుండా రిషి రూమ్ లోకి వెళుతూ ఉండగా… దేవయాని రిషి చాలా బాధపడుతున్నాడు ఇంకా ఎల్లి బాధ పెట్టకు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర కోపంగా నా కొడుకు రూమ్ లోకి వెళ్లడానికి నీ పర్మిషన్ కావాలా అని గట్టిగా అంటూ ఉంటాడు.
అప్పుడు రిషి ఒక్కసారిగా డోర్ తీసి అంత వింటు ఉండగా దేవయాని ఇక ఏడుపు స్టార్ట్ చేసి రిషి దగ్గర సింపతి కొట్టేయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు రిషి వచ్చి ఏడవకు పెద్దమ్మ అని వెళ్ళిపోతూ.. మహేంద్ర జగతిని మీరు చాలా మారిపోయారు. ఇలాంటి పరిస్థితి ఒక్కరోజు వస్తుందని నేను అనుకోలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దేవయాని మహేంద్ర జగతిలను నానా మాటలు అంటూ ఈరోజు రిషి బాధపడడానికి కారణం మీరే నువ్వు అడుగుపెట్టావు జగతి రిషి సంతోషాలన్నీ దూరమయ్యాయి ఈరోజు గురుదక్షిణ విషయాన్ని మీరు పెట్టకుండా ఉంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు దూరంగా ఉండడానికి రిషి బాధపడడానికి అంత కారణము మీరే అని వాళ్ళని నానా మాటలు అంటూ బాధ పెడుతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…