Heart Problems : ఇటీవల కాలంలో చిన్న వయసు వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చాలామంది గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికి కారణం మన జీవన శైలిలో వచ్చిన మార్పులు. మనం తినే ఆహారం పైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఏది పడితే అది తినకూడదు అని చెబుతూ ఉంటారు. కొన్ని పదార్థాలు తినకూడదు అని తెలిసినా తింటున్నాం. మొదట్లో తెలియకపోయినా రోజులు గడిచే కొద్దీ అది ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. అందుకే మనం తీసుకున్న ఆహారంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని ఆహారాలను దూరంగా ఉంచితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎటువంటి పదార్థాలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బులు అనేవి శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన వస్తాయి. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో రక్తపోటు సమస్య వస్తుంది. అధిక రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. చాలామంది దాహం వేసిన లేదా ఏదైనా స్పైసి ఫుడ్ తిన్న తర్వాత వెంటనే కూల్ డ్రింక్స్ త్రాగుతుంటారు. కూల్ డ్రింక్స్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీటిలో ఉండే సోడియం గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అందుకే కూల్ డ్రింక్స్ ని తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు అయినా కొందరు అలానే తాగిస్తుంటారు. రోజులు గడిచే కొద్దీ ఈ కూల్ డ్రింక్స్ ప్రభావం మనపై పడుతుంది. అందుకే ఇప్పటినుంచే సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
అలాగే ఆయిల్ ఫుడ్స్ వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. చాలామంది స్పైసీగా, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. కానీ ఆయిల్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అందుకనే వీటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా ప్రాసెస్డ్ మీట్ నే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రాసెస్ చేసిన మాంసాల్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అలాగే సిగరెట్, ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులు, కాలేయానికి ఎక్కువ హాని కలుగుతుంది. ఇవి నేరుగా గుండెపై ప్రభావం చూపుతాయి. కాబట్టి హై బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.