Guppedantha Manasu 01 October 2022 Episode : గుప్పెడoత మనసు సీరియల్ 1-October-2022 ఎపిసోడ్ 570 ముందుగా మీ కోసం. రిషి వసుధార ని ప్రశ్నిస్తూ ఉంటాడు, కనీసం జాబ్లో జాయిన్ అయిన విషయం నాకు చెప్పాలనిపించ లేదా, నా దగ్గర ఇంతకు ముందు అసిస్టెంట్గా చేసేదానివి అదైనా గుర్తుందా అని అనగానే, నాకు గుర్తుంది సార్ అప్పుడు జీతం తీసుకొని అసిస్టెంట్గా చేశాను, ఇప్పుడు జీవితాంతం మీతో నడిచి అసిస్టెంటుగా ఉంటున్నాను అని అనగానే, రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏమీ జరగనట్టు ఇంత నార్మల్ గా మాట్లాడుతుంది అని, అప్పుడు వసుధార ఏంటి సార్ ఏమీ జరగనట్టు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా, అభి ప్రాయభేదాలు ఉన్నంత మాత్రాన, ప్రేమ కరిగిపోదు కదా సార్ అని అంటూ ఉంటుంది, ఇంతలో అక్కడికి మహేంద్ర వచ్చి మినిష్టర్ గారు రమ్మంటున్నారు, వెళ్లమని చెబుతాడు, రిషి చెయ్యి ఏలా వుంది అని జగతి అడుగుతుంది, పర్వాలేదు మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళతారు, కారులో రిషి, వసుధార ఇద్దరూ సైలెంట్ గా ఉంటారు, నువ్వే మాట్లాడొచ్చు కదా అని రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు, వసుధార కూడా మాట్లాడొచ్చు కదా సార్ మీరే ముందు అని అనుకుంటూ వుంటారు ఇద్దరూ, అప్పుడు వసుధార రిషి చేయి పట్టుకొని, కార్ ని ఆపండి సార్ అని కారు ని ఆపుతుంది, ఒకవైపు జగతి, మహేంద్ర సంతోషంగా ఉంటారు, గౌతమ్ అక్కడికి వస్తారు, సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.
రిషి వసుధార గురించి, తరువాత రిషి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది, ఇలా ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు ఎందుకిలా చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు రిషి, అప్పుడు వసుధార సమాధానం చెపుతుంది, ఈ చెయ్యి నాకు కాలేజీలో సీటు ఇచ్చింది, ఈ చెయ్యి నాకు అండగా ఉంది అంటూ రిషి గురించి మాట్లాడుతూ ఉంటుంది, ఇంత ప్రేమ పెట్టుకుని మరీ ఇలా ఎందుకు చేస్తున్నావని అనగానే, అన్నీ నచ్చాలని లేదు కదా సార్, కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి అని అంటూ, వసుధార ఒక ఉదాహరణ చెబుతూ రిషి తొ మాట్లాడుతూ ఉంటుంది, అప్పుడు రిషి కూడా అంటాడు, నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఎంత బాధ అనుభవించానొ నాకు తెలుసు, నాకు తలనొప్పి వస్తే ఎవరైనా ఫ్రెండ్ టాబ్లెట్ వేసుకొ అని మాత్రమే చెబుతారు, కానీ ఆ నొప్పిని భరించే ది నేనే కదా, ఇలా కొద్దిసేపు జగతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు, తరువాత ఇద్దరూ మినిస్టర్ దగ్గరికి వెళతారు, మినిస్టర్ వసుధార గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, అంత తెలివైన అమ్మాయి ఇక్కడ జాబ్ చేయడం చాలా సంతోషంగా ఉంది, కానీ తన తెలివికి ఇది సరిపోదు అని అనగానే, కానీ తనే పట్టుబట్టి ఈ జాబ్ కావాలి అని అడిగింది అని అనడంతో, రిషి ఒక్కసారిగా వసుధార వైపు చూస్తాడు.
Guppedantha Manasu 01 October 2022 Episode : మినిస్టర్ ని కలిసిన రిషి వసుధార
ఇలా కొద్దిసేపు వసుధార గురించి మాట్లాడుకుంటూ, ఏమి జరిగిన వసుధార ని మాత్రం వదిలి పెట్టకూడదు అని అంటాడు, అప్పుడు రిషి మనసులో అనుకుంటాడు, ఏంటి పర్సనల్ విషయాలు తెలిసినట్టు ఇలా మాట్లాడుతున్నారు మినిస్టర్ గారు అని అనుకుంటాడు, ఒకవైపు జగతి మహేంద్ర తో అంటూ ఉంటుంది, ఇంకా రిషి రావడం లేదేంటి అని అనగానే, రిషి వెళ్ళింది వసుధారతో వాళ్లు ఎంతసేపు కలిసి ఉంటే అంత మంచిది, తొందరగా రావాలని కోరుకోకు అని మహేంద్ర ఇలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి దేవయాని వస్తుంది, వీళ్లు సరదాగా నవ్వుకుంటూ ఉంటే, కోపంగా ధరణి అని అరుస్తూ ఉంటుంది, అసలేమనుకుంటున్నారు మీరు అని వచ్చి మీరు రెచ్చగొడుతున్నారు, రిషి జీవితాన్ని పాడు చేస్తున్నారు అని ఏదెదొ మాట్లాడుతూ ఉంటుంది, అప్పుడు మహేంద్ర అంటాడు ఆ మాట అనాల్సిందే నేనే కదా వదినగారు, మీరు అంటున్నారేంటి, మీరే అనవసరంగా వాళ్ల మధ్యలోకి వస్తున్నారు అని, ఇలా రిషి గురించి చాలాసేపు వాదించుకుంటుంటారు, దేవయాని మాటలకి మహేంద్ర తన సహనాన్ని కోల్పోతాడు, అవును అసలు మా బిడ్డ విషయంలొ మీరేంటి ఇలా చేస్తున్నారు, రిషి జోలికి వస్తే మాత్రం నేనూరుకోను, మీ నిజ స్వరూపాన్ని అన్నయ్య కి, రిషికి అందరిముందు చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.