Guppedantha Manasu 14th July Today Episode : మిషన్ ఎడ్యుకేషన్ గురించి రిషి ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా, సాక్షి తన ఐడియాని చెప్తుంది.ఆ ఐడియా మొత్తం హంగులు ఆర్భాటాలతో నిండివున్న ఐడియా అని వసుధార వ్యతిరేకించి చెప్తుంది. మిషన్ ఎడ్యుకేషన్లో చదువులు పండగ అనేది అందరికీ తెలిసేలా చేయాలి తప్పా. హంగులు ఆర్భాటాలకు పోకూడదు అని వసుధార చెప్తుంది. వసుధార చెప్పినదానికి మహేంద్ర కూడా సపోర్ట్ చేసి మాట్లాడతాడు. అవును రిషి ఒక ఆలోచన డబ్బు ఖర్చు లేకుండా కూడా చేయొచ్చు.
అని మహేంద్ర రిషితో చెప్తాడు.ఇలా మహేంద్ర, జగతి అందరూ వసుకి సపోర్ట్ చేస్తారు.సాక్షి వెంటనే అందరూ వసుధారకే సపోర్ట్ చేస్తున్నారు అని మనసులో అనుకొని, రిషి ముందు నువ్వేమంటావు చెప్పూ అని అడుగుతోంది.రిషి కూడా వసుధార చెప్పిందే కరెక్ట్ అనే అంటాడు.చదువుల పండగ అంటే ఒక సంక్రాంతి పండుగలాగా ఉగాది పండుగ లాగా ఆహ్లాదకరంగా ఉండాలి సార్. అంతేగానీ బర్త్ డే ఈవెంట్ లాగ మార్చకూడదు సార్ అని చెప్తోంది వసుధార. వసుధార చెప్పిన ఐడియాకి గౌతమ్, జగతి, మహేంద్ర, రిషి, అందరూ క్లాప్స్ కొడతారు.రిషి వెంటనే జగతి తో మేడం మీరు దీని గురించి ప్లాన్ చేయండి అని చెప్తాడు రిషి. అలాగే వసుధార, సాక్షి మీరిద్దరూ దీని గురించి పనిచేయండి అని చెప్తాడు రిషి.
Guppedantha Manasu 14th July Today Episode : సీరియల్ దేవయానికి తన మాటలతో చెక్ పెట్టిన జగతి
డాడి అలాగే మీరు కూడా ఈ పనికి సంబంధించిన ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే తప్పకుండా చెప్పండి అని రిషి మహేంద్రతో చెప్తాడు.అలాగే డాడి మేడమ్ కి చెప్పి సాక్షి, వసుధార ఉండటానికి గెస్టురూంలో ఏర్పాటు చెప్పేయండి అని రిషి మహేంద్రతో చెప్పి వెళ్లిపోతాడు.అందరూ అలా రూమ్లోకి వాళ్ళువెళ్ళిపోతారు. ఇకపోతే సాక్షి వసుధార ఇద్దరూ ఉంటారు. ఏంటీ రెండు పండగల పేర్లు చెబితే సరిపోతుందా అని సాక్షి,వసుధారతో వెటకారంగా మాట్లాడుతుంది దానికి వసుధార ఆల్ ది బెస్ట్ అని సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత వసుధార సాక్షి ఇద్దరూ ఒకే గదిలో ఉంటారు. వసుధార తన పని తను చేసుకుంటూ ఉంటుంటే సాక్షి మాత్రం తనని కోపంగా చూస్తూ ఉంటుంది.
ఏంటి అలా చూస్తున్నావ్ అని వసుధార అడుగుతుంది.నా కర్మకాకపొతే నేను నీతో రూం షేర్ చేసుకోవడం ఏంటి చెప్పు అని సాక్షి వసుధారతో అంటోంది. వర్క్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు అని వసుధార అంటుంది. దాంతో సాక్షి నువ్వంటే పేదరికంలో పుట్టి పెరిగాను,నాకిలాంటివన్నీ అలవాటు లేవు అని అంటోంది సాక్షి. వర్క్ చేయాలని లేదా రిషి సార్కి ఐడియాలు చెప్తానన్నావ్ కదా అని అంటోంది. అప్పటికప్పుడు నాకు ఐడియాలు వస్తాయి అని సాక్షి చెప్తుంది.నాకు బోర్ కొడుతుంది నీకు కథలేమన్నా వచ్చా అని సాక్షి వసుధారని అడుగుతుంది.
పని వదిలిపెట్టి ఇప్పుడు కథలు కావాలా అని వసుధార అంటోంది. రావని చెప్పొచ్చు కదా అని సాక్షి అంటే వసుధారకి రాని కథలు ఉండవు.వసుధార కథలు చెప్తే మామూలుగా ఉండదు అని అంటోంది. చిన్న పిల్లలకు చెప్పే పిట్టకథలు చెప్పకు నా రేంజ్లో కథలు చెప్పు అని సాక్షి అంటుంది. నీ రేంజ్లో ఎందుకు నిజంగా జరిగిన స్టోరీ చెత్త అని వసుధార అంటోంది.సరే చెప్పు అని సాక్షి అనగానే వసుధార స్టోరీ మొదలుపెడుతుంది. నా టెన్త్ క్లాస్ లో మోహిని అనే ఒకమ్మాయి ఉండేది. కొన్నాళ్లకి తనే సడన్గా మాయమైపోయింది.తనకి ఏమైందో ఏమో తెలియదు అందరూ ఒక్కొక్కరు ఒక్కోలాగా అనుకుంటూ ఉండేవారు. నేనొకరోజు పనిమీద సిటీకి వచ్చాను రోడ్డుమీద మోహిని కనిపించింది.
నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది. సరె కదా అని నేను వెళ్లాను. ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవ్వరూ లేరు. మోహిని వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది కాఫీ తాగెముందు కాఫీ వైపు చూస్తే కప్పులో కాఫీ ఎర్రగా రక్తం లాగా కనిపించింది. దాంతో నాకు ప్రాణాలు పోయినట్టు భయం వేసింది.ఎదురుగా మోహిని నవ్వుతూ కాఫీతాగు వసుధార అంటోంది.ఇంట్లో చూస్తే ఎవ్వరూ లేరు నాకు చాలా భయమేస్తోంది తాగవెే అని గట్టిగా నన్ను బెదిరించింది. అలా ఏదేదో చెప్పి సాక్షికి బెదురు పుట్టేలాగా వసుధార స్టోరీ చెప్తుంది.తర్వాత కానీ నాకు తెలిసింది ఆ మోహిని చచ్చిపోయింది తను దయ్యం అని. ఎప్పుడైనా సరే మూడుసార్లు మోహిని మోహిని మోహిని అని పిలిస్తే వస్తాను అని చెప్పింది.
సాక్షి ఇప్పుడు పిలుద్దామా అని అనగానే సాక్షి భయంతో దుప్పటి తప్పుకొని పడుకుంటుంది.పని వదిలిపెట్టి కథలు కావాలా ఇప్పుడు. అని వసుధార అనుకుంటోంది మనసులో.ఇకపోతే రిషి తన గదిలో కూర్చుని పదేపదే అన్నీ జరిగిన విషయాల గురించీ, వసుధార గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఫోన్ తీసి దాంట్లో వసుధార ఫోటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార నువ్వు రాకముందు వచ్చిన తర్వాత అని గీత గీసుకుని ఉంటే చాలా మార్పు కనిపిస్తోంది. నిన్ను అసలు ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. జీవితం మొత్తంలో నేను మర్చిపోలేని విషయం అని ఆలోచిస్తూ ఉంటాడు తన జ్ఞాపకాలను తీసిచూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు.
సాక్షి కి సడన్గా మేలుకోవచ్చు చూస్తుంటే వసుధార చెప్పిన కథనే గుర్తుతెచ్చుకుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో చేరుమీద వింతగా కూర్చున్నట్టు కనిపిస్తారు మోహిని మోహిని వసుధార వసుధార అని చాలా భయపడి లేస్తుంది నువ్వే నా కూర్చుంది మోహిని వచ్చిందా నాకు భయమేసింది అని సాక్షి అంటోంది. మోహిని వస్తే తప్పకుండా నిన్ను లేపి పరిచయం చేస్తాను అని వసుధార సాక్షితో చెప్తుంది. ఇక్కడే కూర్చుంటే నా పని కాదు రిషి సార్ లేచి చూస్తే తిడతాడు నేను బయటికి వెళ్లి పని చేసుకుంటాను అని సాక్షిని ఒంటరిగా వదిలిపెట్టి వసుధార హాల్లోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది.
రిషి సార్ లేచె వరకు వర్క్ కంప్లీట్ కావాలి అని అనుకుంటూ ఉండగా, ఇంతలో రిషి తన గదిలో నుంచి బయటికి వస్తాడు.వసుధారని చూస్తాడు. ఏంటి వసు ఇంకా పడుకోలేదా నేను చెప్పానని చాలా శ్రద్ధగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది అని అనుకొని. రిషి కిచెన్లోకి వెళ్లి వసు కోసం కాఫీ చేసి తీసుకొచ్చి ఇస్తాడు.కానీ వసుధార కాఫీ తెచ్చింది జగతి మేడం అనుకోని ఏమాటకామాట చెప్పుకోవాలి మేడం కాఫీ చేయడంలో మీ తర్వాతనే ఎవరైనా అని కాఫీని ఆస్వాదించి తాగుతూ ఉంటుంది. అలా కొంచెం కాఫీ తాగిన తర్వాత రిషి సార్ని చూస్తోంది. సార్ మీరా అని లేవబోతుంటే వద్దు కూర్చో కూర్చో కాఫీ మీద పడుతుంది అని చెప్తాడు రిషి.
మీరు కాఫీ నాకు తేవటం ఏంటి సార్ ఇలా మీరు నుంచుంటే నేనెలా కూర్చుని కాఫీ తాగడం ఏం బాగోలేదు సార్ అని చెప్తోంది వసుధార.ఇదేం కాలేజీ కాదు నువ్విప్పుడు మా ఇంటికి వచ్చవు ఏం పర్లేదు కానీ ఇంతకీ వర్క్ యక్కడిదాకా వచ్చింది అని అడుగుతాడు రిషి . దాదాపు అయిపోవచ్చింది సార్ అని వసుధార చెప్తోంది.అవును ఏదో చెప్పాలి ఏదో మాట్లాడాలి టైం అడుగుతావు కదా ఏంటో చెప్పు అని రిషి అడుగుతాడు. ఇప్పుడు చెప్పు వసుదార అని అనగానే వెంటనే వసుధార ఇప్పుడు నా మనసులో మాట చెప్తే ఎలా వుంటుందో ఏంటో అని తడబడుతోంది.ఏంటి అంతలా ఆలోచిస్తున్నావ్ అంతలా ఆలోచించే మాటలు ఏముంటాయి అని రిషి అంటాడు.
ఎందుకు ఉండవు సార్ మనం మాట్లాడాలి అనుకుంటే చాలా మాటలు ఉంటాయి. చిన్నప్పటి జ్ఞాపకాలు, చిన్నప్పటి సంగతులు, చిన్నప్పుడు మనం చేసే అల్లరులు, అలా చాలా ఉంటాయి. మీరు వింటానంటే అన్నీ చెప్తాను చాలా కబుర్లు ఉన్నాయి సార్ అని వసుధార చెప్తోంది.వసుధార వినే వాళ్లు ఉంటే గంటల తరబడి చాలా కబుర్లు మాటలు చెబుతూనే ఉంటావు కదా అని రిషి అంటాడు.అలా రిషి, వసు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని వచ్చి చూస్తుంది. ఈ టైమ్లో వీళ్లిద్దరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా అది కూడా నా ఇంట్లో అని కోపంగా అనుకుంటూ ఉంటుంది.
అసలు వసుధారని నా ఇంట్లోకి రానియ్యటం లేదు తప్పు అని కోపంగా వాళ్ల వైపు వెళుతోంది.అలా వాళ్ల వైపు వెళుతున్న దేవయానిని జగతి వచ్చి చేయి పట్టుకొని లాక్కొని ఆపుతుంది.ఏంటి జగతి నా చెయ్యి పట్టుకుని మరీ ఆపుతున్నావో అని అడుగుతుంది దేవయాని. వెళ్లకూడదని ఆపుతున్నాను అని అంటోంది జగతి.వాళ్లిద్దరూ అలా ఏకాంతంగా ఉండాలని ప్లాన్ చేస్తావా అని చీఫ్ గా మాట్లాడుతుంది దేవయాని.దేవయాని మాటలకి జగతికి కోపం వచ్చి మర్యాదగా మాట్లాడండి. వాళ్లు కాలేజీకి సంబంధించిన పని చేసుకుంటూ ఉంటారు. వాటర్ అయిపోతే నేను బయటికి వచ్చాను ఎదుటివారి మీద నమ్మకంలేనిది మీకు. అడ్డమైన ఆలోచనలు ప్లానులు వేసేది మీరు అలాంటి పనులు నాకు రావు అనే జగతి దేవయానితో అంటోంది.ప్రగతి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని దేవయాని అంటోంది.
అలా దేవయాని అనగానే జగతి వెంటనే లైబ్రరీలో జరిగిన సంఘటన మొత్తం నాకు తెలుసు అది మొత్తం మీ ప్లాన్ అని నాకు తెలుసు జరిగింది మొత్తం వెళ్లి రిషికి చెప్పి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి మీరిప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతే అది పద్ధతిగా ఉంటుంది. మీరు ఇక్కడే ఉండగా రిషీ దగ్గరికి వెళ్లి సాక్షి చేస్తున్న పనులన్నింటికి కారణం ఎవ్వరో తన వెనకాల ఉన్నది ఎవరో అన్నీ వెళ్లి రిషితో చెప్తాను.చెప్పమంటారా అక్కయ్యా అని అంటోంది జగతి. దాంతో దేవయాని లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.