Zodiac Signs : జులై నెల 2022 తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభంలో బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. కలిసివుండి రెండవ తేదీ నుండి మిధునంలోకి చేరుకుంటాడు. ఇలా చేరుకున్న తర్వాత 17వ తేదీ వరకు అక్కడే ఉండి తర్వాత బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తారు ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని ఉండకుండా కుంభంలోకి వచ్చి అక్కడనుండి మళ్ళీ మకరంలోకి వస్తాడు. అదేవిధంగా మీనంలో గురువు యొక్క సంచాలకం జరుగుతుంది
వృశ్చిక రాశి వారికి రాసి నాధుడు వెళ్లి ఆరవ స్థానంలో కూర్చున్నాడు. ఈ రాశి వారి పట్టుదలతో చేస్తే ఏ పనైనా కలిసి వస్తుంది. ఎప్పటినుంచో ఉండే బాధలు తొలగి పోతాయి. ఎప్పటి నుంచో కానీ పనులు అన్ని ఇప్పుడు ఈ మాసంలో జరుగుతాయి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ట నక్షత్రాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి కొత్త కొత్త విషయాలలో ధన లాభం కలగబోతుంది. అనురాధ నక్షత్రం వారికి ఉన్న ప్లేస్ నుంచి మారటం అలాగే కొన్ని ప్రాపర్టీల వల్ల ధనం వచ్చేది కనిపిస్తుంది.
Zodiac Signs : గ్రహస్థితి ఎలా ఉన్నాయంటే…
జేష్ట నక్షత్రం వారికి విద్యకు సంబంధించిన విషయాలు కు చేసే ప్రయోగాలు అనుకూలత కనిపిస్తుంది. అదేవిధంగా పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చిన చిక్కులు అన్నీ తొలగిపోతాయి. వృచ్చిక రాశి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని విషయాలలో ధనం వచ్చేది అవకాశాలు ఉన్నాయి.అలాగే మీరు ఇష్టపడిన వారినే వివాహం చేసుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
12వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా సక్సెస్ అవుతుంది. 17 తర్వాత నుంచి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది అలాగే వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. కానీ తొందరపడి ఏ పని చేయొద్దు. ఏ పని చేసిన ఆలోచనలతో చేయాలి. వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధన: గణపతి యొక్క ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన అలాగే గోవుకు క్యారెట్లు, అరటి పండ్లు తినిపించడం అలాగే రాహువు, కుజుడు, శని దగ్గర దీపరాధన చేయండి అన్ని పనులలో అనుకూలతను పొందుతారు.