Guppedantha Manasu 15 October 2022 Episode : చిన్ని తెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది ఈరోజు ఎపిసోడ్ 583 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జగతి వసుధారాన్ని చీర కట్టుకొని రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు ధరణి చీర కట్టుకొని రమ్మంటూ ఉండగా.. వసుధార మాత్రం ధరణి కి చీర కట్టి కిందికి తీసుకొని వస్తుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ.. ఏం చేసావు వసుధార అని అంటుండగా రిషి మాత్రం ఎవరినీ ఏమీ అనకండి.. ఎవరి ఇష్టాలు వాళ్ళవి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవయాని ఇక తెగ డ్రామాలాడుతూ మా అత్తయ్య చీర నాకు గౌరవం ఉంటుంది బయట వాళ్లకి ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు వసుధార చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా రిషి గట్టిగా తొందరగా బొమ్మల కొలువు పూర్తి కానివ్వండి ఎవరిష్టలవి వాళ్ళవి మన కుటుంబంతో నడవాలని లేని వాళ్ళతో మనం ఎక్కువసేపు మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటాడు.
Guppedantha Manasu 15 October 2022 Episode : వసుధారపై చేయి చేసుకున్న జగతి…
తర్వాత దేవయాని జగతి ధర్మిని పూజ తొందరగా ముగించమని అడుగుతూ ఉంటారు. అప్పుడు ధరణి పూజ మొత్తం ముగించి అందరికీ హారతి ఇస్తుంది. తర్వాత వసుధార దగ్గరికి తీసుకెళ్లగా తను తీసుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు దేవయాని దైవం దగ్గర అందరూ సమానులే తీసుకో పోసుదారా అని చెప్తూ ఉంటుంది అప్పుడు హారతి వసుధర తీసుకుంటుంది. తర్వాత రిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జగతి కూడా కోపంగా వెళుతూ వసూని ఒకసారి నా రూమ్ లోకి రా నీతో మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు వస్తారా తన రూమ్ లోకి వెళ్ళగానే… ఇక దయచేసి ఈ ఇంటికి రాకు అని చెప్తుంది వసుధారాణి. అప్పుడు మేడం నేనంటే ఏంటో తెలియదా అని వసు అంటుంది. అప్పుడు నువ్వంటే నాకు తెలుసు తెలివైన దానివని తెలుసు కానీ ఇప్పుడు మనుషుల మనుషులని ఎలా ముక్కలు చేస్తావో నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటూ ఉంటుంది.

ఇక అప్పుడు నేను గురుదక్షిణ కోసమే ఇలా చేశాను మీకోసమే అని అంటుండగా జగతి ఒక్కసారిగా వసుధార చంప పగలగొడుతుంది. ఇంకొక్కసారి ఈ మాట మాట్లాడేవంటే అస్సలు బాగోదు అని తిడుతూ ఉండగా రిషి బయట నుంచి అంతా చూసి జగతి మేడం అని గట్టిగా మొత్తుకుంటూ మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా తను బాధపడితే నేను తట్టుకోలేను నా ముందే తనని కొడతారా అని జగతిపై మండిపడుతూ ఉంటాడు. దేవయాని కూడా మన ఇంట్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి వాటిని కాదని ఒక ఆడపిల్లని కొడతావా అని తెగ డ్రామాలాడుతూ ఉంటుంది. తర్వాత వసుధార నన్ను కొట్టే ఆకు మేడంకు మాత్రమే ఉంది అంటూ ఈ ఇంట్లో ప్రేమలేఖ ఆప్యాయతలు ఎక్కువ అని చెప్తూ ఉండగా జగతి వసు అని అంటుంది అప్పుడు ఋషి ఇక ఆపండి మేడం అని తిడుతూ అయినా మీకు బాధంటే ఏంటో ఎలా తెలుస్తుంది లేండి చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్లిపోయిన వాళ్లకి ఏం అర్థం అవుతుంది అని అంటూ వసుధర చేయి పట్టుకొని తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ రిషి మాటలకి జగతి బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…