Guppedantha Manasu 15 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 15-September-2022 ఎపిసోడ్ 556 ముందుగా మీ కోసం. వసుధార కి రిషి చీరను తీసుకుని వస్తాడు. అప్పుడు వసుధార రిషితో ఇలా అంటుంది, సార్ నేను ఈసారి మీకు సెలెక్ట్ చేసాను, మీరు ఏ డ్రెస్ వేసుకోవాలో అని అనగానే, సరే అనడంతో,వసుధార ఒక డ్రెస్ కాంబినేషన్ తీస్తుంది, ఇది ఎలా ఉందో చూడండి సార్ అనేలోపు, అక్కడికి గౌతం వచ్చి ఛండాలంగా వుంది, ఇదేం డిజైన్ అనడంతో, గౌతమిని ఆపుతాడు రిషి ఏమి అనకుండా, వసుధార సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకొని వెళతాడు, రిషి వాళ్ళ పెదనాన్న కూడా ఏంటి ఎప్పుడు నీ డ్రెస్ సెలెక్షన్ బాగుంటుంది కదా, ఈసారి లేదేంటి అనడంతో, వసుధార కి అర్థం అవుతుంది సార్ నచ్చకపోయినా నేను చెప్పాను అని వేసుకున్నాడు, ఎలాగైనా డ్రెస్ మార్చేలాగే చెయ్యాలి అని అనుకుంటుంది, ఈలోపు ధరణి ఎక్కడమ్మా కాఫీ కావాలి అనే లోపు, రిషి వసుధారాణి పెద్దనానకి కాఫీ తీసుకుని రా అని చెబుతాడు.ఒక వైపు జగతి రెడీ అవుతూ ఉంటుంది.
Guppedantha Manasu 15 September 2022 Episode : మహేంద్ర వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో దేవయాని ఏదైనా కుట్ర పన్నిందా?
జగతి మహేంద్ర ఇద్దరూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈరోజు అంటూ ఒక రోజు వస్తుందని అనుకోలేదు అంటూ ఇద్దరూ చాలా సంబర పడుతూ ఉంటారు గదిలో, ఒక వైపు వసుధార కావాలనే రిషి డ్రెస్ పైన కాఫీని పడేలా చేస్తుంది,అప్పుడు దేవయాని ఉండి ఏంటి ఇలా చేశావు అని, అయినా ధరణి ఎక్కడ ఈ పనులన్నీ చూసుకోడానికి అని, వసుధార మీద కోపడేలోపు, రిషి ఉండి ఏం కాదులే పెద్దమ్మా నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను అని చెపుతాడు,అప్పుడు వసుధరా లోపల సంతోష పడుతూ ఉంటుంది, అనుకున్నట్టుగానే రిషి సార్ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్లబోతున్నాడు అని,డ్రెస్ పాడవ్వడంతొ రిషి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాడు. ఇంతలో వసుధార దగ్గరికి జగతి రావడంతో, జరిగిన దాన్ని జగతికి చెబుతుంది, డ్రెస్ మార్చుకొని రెడీ అవ్వమని వసుధారాణి జగతి చెప్పటంతో, వసుధరా వెళ్లి రెడీ అవుతూ ఉంటుంది, రిషి ఇచ్చిన శారీనే కట్టుకుని అద్దం ముందు చూసుకుంటూ ఉంటుంది.
ఒక్క సారిగా వెనక్కి తిరిగే సరికి రిషి వస్తాడు, వసుధార దగ్గరికి, వాళ్లు ఇద్దరూ కొద్దిసేపు ఒకరి నొకరు చూసుకుంటూ ఉంటారు ఇలా రొమాంటిక్ సీన్ మొదలవుతుంది, ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు అని వసుధార అంటుంది.రాకూడదా అని రిషి అంటాడు, ఏమీ లేదు సార్ అని అంటూ, డ్రెస్ బాగుంది అంటూ ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటూ, కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్లు ఇలా మాట్లాడుకోవడాన్ని జగతి, మహేంద్ర చూస్తూ నవ్వుకుంటూ వుంటారు.రిషి, వసుధార ఇద్దరు పక్క పక్కనే నిలబడి ఉండటాన్ని గమనించిన జగతి, మహేంద్ర వీళ్ళ జంట ఎంత బాగుందో అని ఇద్దరూ సంతోషపడుతూ ఉంటారు వాళ్లిద్దరి గురించి, వాళ్ళు అలా ఉండడాన్ని గమనించి అదే వైపు వెళుతున్న గౌతమ్ కూడా చూస్తూ ఉంటాడు, ఇలా అందరూ కలిసి రిషి, వసుధార నీ ఆట పట్టిస్తూ ఉంటారు, తరువాత అతిథులు అందరూ రావడం మొదలవుతుంది, సెలబ్రేషన్స్ ని కూడా మొదలు పెడతారు,ఇలా సంతోషంగా సాగుతున్న సెలబ్రేషన్స్ పైన దేవయాని ఎటువంటి కుట్ర చేయబోతుంది, వీళ్ల సంతోషాన్ని ఏ విధంగా చెడగొడుతుoది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.